జాతీయ వార్తలు

ప్లస్ డాక్టర్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూలై 29: ప్లస్ లోగో ఉన్నవాళ్లంతా వైద్యులే. కానీ, ఇకనుంచి ప్లస్ డాక్టర్ ఉంటే మాత్రం అలోపతి వైద్యులని అర్థం. ఈమేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొత్త లోగోను రిజిస్టర్ చేసుకుంది. దానిపై పేటెంట్ సైతం తీసుకుంది. దేశవ్యాప్తంగా అర్హత కలిగిన అలోపతి వైద్యులంతా ఇకనుంచి ‘డాక్టర్ ప్లస్’ లోగో వాడుకుంటారు. ఆయుర్వేదం, హోమియోపతి, నాటువైద్యం.. ఇలా ఏ తరహా వైద్యులైనా ‘ప్లస్’ సింబల్‌ను వాడటం జరుగుతోంది. అయితే ఆధునిక వైద్య విధానాన్ని అనుసరిస్తున్న అలోపతిని ప్రత్యేకంగా చెప్పుకోవడానికే ఈ కొత్త లోగోను రూపొందించి రిజిస్టర్ చేసుకున్నట్టు చండీగఢ్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రామ్‌నీక్ సింగ్ బేడి వెల్లడించారు. వైద్యం అనగానే అందరికీ అలవాటైన రెడ్ ప్లస్ గుర్తు మధ్యలో డాక్టర్ అన్న అక్షరాలు కాపర్‌తో ఉండేలా లోగోను డిజైన్ చేశారు. అర్హత కలిగిన అలోపతి వైద్యులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడనుందని బేడి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త లోగోను రిజిస్టర్ చేసుకుని, దానిపై మేధోసంపత్తి హక్కులను సైతం ఐఎంఏ తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.