జాతీయ వార్తలు

సరిహద్దులు మూయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 29: సరిహద్దుల గుండా వాణిజ్యాన్ని మూసివేయడానికి పిడిపి అనుమతించదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో అధీనరేఖ గుండా మరిన్ని మార్గాలను తెరవడానికి కృషి చేస్తుందని జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెప్పారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 18వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన భారీ ర్యాలీలో మెహబూబా మాట్లాడుతూ ఏడాదికోసారి సంయుక్త సమావేశం జరగడానికి వీలుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌నుంచి కూడా సభ్యులను కాశ్మీర్ అసెంబ్లీకి నామినేట్ చేయాలని ప్రతిపాదించారు. ఈ నెల 21న పాక్ ఆక్రమిత కాశ్మీర్‌నుంచి వస్తున్న ఒక ట్రక్కులో సుమారు 300 కోట్ల రూపాయల విలువైన 66.5 కిలోల హెరాయిన్, బ్రౌన్ సుగర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలకు నిధులు అందడంపై దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా అధీన రేఖ గుండా వాణిజ్యాన్ని మూసివేయాలని సిఫార్సు చేయవచ్చనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌నుంచి ఏమి వస్తున్నాయి, ఇక్కడినుంచి ఏమి వెళ్తున్నాయో తెలుసుకోవడానికి వీలుగా ట్రక్కులకోసం ఫుల్ బాడీ స్కానర్లు కూడా ఉండాలి అని అన్నారు. ‘మన అసెంబ్లీలో సరిహద్దుకు ఆవలి వైపున ఉన్న కాశ్మీర్‌కోసం సీట్లు రిజర్వ్ చేసి ఉన్నాయి. ఆ సీట్లకోసం నామినేషన్లు జరపడానికి ఇరువైపుల వారు కలిసి నిర్ణయించాలి. అలాగే పర్యాటకం, రవాణా, శారదా పీఠాన్ని తెరవడం లాంటి అంశాలను చర్చించడానికి ఏడాదికోసారి ఈ అసెంబ్లీ సమావేశం కావడం గురించి కూడా నిర్ణయం తీసుకోవాలి’ అని ఆమె అన్నారు. అలాగే తరచుగా విద్యార్థుల మార్పిడి కూడా జరగాలని ఆమె అభిలషించారు. కాశ్మీర్‌లో రక్తపాతానికి ముగింపు పలకడానికి మార్గాలను అనే్వషించాలని బిజెపి, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ అన్ని ప్రధాన పార్టీలకు ఆమె విజ్ఞప్తి చేశారు.