జాతీయ వార్తలు

మంత్రివర్గాన్ని విస్తరించిన నితీశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 29: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. జనతాదళ్ (యునైటెడ్), బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి నుంచి కొత్తగా 27 మందికి ఆయన తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. వీరిలో జెడి(యు)కి చెందినవారు 14 మంది, బిజెపికి చెందినవారు 12 మంది, ఎల్‌జెపి (లోక్ జనశక్తి పార్టీ)కి చెందిన ఒకరు ఉన్నారు. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. బిహార్‌లో జెడి(యు)-ఎన్‌డిఎ ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో విశ్వాస ఓటును పొందిన మరుసటి రోజు (జూలై 27వ తేదీన) ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా సుశీల్ మోడీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. రాజ్‌భవన్‌లో శనివారం తొలుత జెడి(యు)కి చెందిన విజేంద్ర ప్రసాద్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆ తర్వాత బిజెపికి చెందిన ప్రేమ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ప్రమాణ స్వీకారం చేసిన ఇతర కొత్త మంత్రుల్లో జెడి(యు)కి చెందిన రాజీవ్ రంజన్ సింగ్ లల్లన్, బిజెపికి చెందిన నంద్ కిశోర్ యాదవ్, మంజు వర్మ, ఎల్‌జెపికి చెందిన పశుపతి కుమార్ పరస్ (కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు) ఉన్నారు.

చిత్రం.. బిహార్ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌తో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్