జాతీయ వార్తలు

బెంగళూరు రిసార్ట్‌కు గుజరాత్ ఎమ్మెల్యేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కాకుండా చూసేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న బిజెపి నుండి తమ శాసన సభ్యులను కాపాడుకునేందుకు పార్టీ అధినాయత్వం అష్టకష్టాలు పడుతోంది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తమ శాసన సభ్యులను ఎక్కడ ఎత్తుకుపోతాడోనని భయపడుతున్న కాంగ్రెస్ గుజరాత్ వ్యవహారాల ఇంచార్జ్ అశోక్ గెహ్లాట్ దాదాపు నలభై మందిని కర్నాటక రాజధాని బెంగళూరు సమీపంలోని ఈగల్‌టన్ రిసార్ట్ హోటళ్లలో భద్రం చేస్తే, మరో ఐదుగురిని తిరుమలలో దాచిపెట్టినట్లు తెలిసింది. అశోక్ గెహ్లాట్ స్వయంగా ఈటల్‌టన్ రిసార్ట్‌లో బస చేశారని అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఐదోసారి రాజ్యసభకు ఎంపికయ్యేలా చూసేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం పావులు కదుపుతోంది. బెంగళూరు శివార్లలోని రిసార్ట్ హోటళ్లలో బసచేసిన శాసనసభ్యులను కాపాడుకునేందుకు ప్రైవేట్ బౌన్సర్లను కూడా రంగంలోకి దించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాసనసభ్యులు బయటివారితో మాట్లాడకుండా చూసేందుకు వారి మొబైల్ ఫోన్లపై కాంగ్రెస్ అధినాయకత్వం నిఘా ఏర్పాటు చేసింది. నిసార్ట్ నుండి ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరైనా బిజెపి నాయకులతో టచ్‌లో ఉన్నారా? కాంగ్రెస్ శాసనసభ్యులతో మాట్లాడేందుకు బిజెపి నాయకులు ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? అనే అంశంపై కూడా నిఘా పెట్టారు. ఈ నిఘాకోసం కర్నాటక సిఐడి విభాగం అధికారులను రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు మఫ్టీ పోలీసులను కాంగ్రెస్ శాసనసభ్యులు ఉంటున్న రిసార్ట్‌లో నియమించినట్లు చెబుతున్నారు. రిసార్ట్‌లో ఉండేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్న కొందరు శాసనసభ్యులను సిమ్లాకు పంపించే అవకాశాలున్నాయి. గుజరాత్ నుండి రాజ్యసభకు ఎంపిక చేయవలసిన 3 స్థానాలకు ఆగస్టు 8న పోలింగ్ జరిగే సమయానికి అహ్మదాబాద్‌కు వీరిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.