జాతీయ వార్తలు

ఐటి రిటర్న్స్‌కు నేడే ఆఖరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 30: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు సోమవారం ఆఖరు తేదీ. రేపటి కల్లా ఐటిఆర్‌ను పూర్తిచేయాలని, రిటర్న్స్ దాఖలుకు ఆఖరి తేదీని పొడిగించబోమని ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. సకాలంలో పన్ను చెల్లింపుదారులంద రూ విధిగా రిటర్న్‌లను దాఖలు చేయా ల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ-్ఫల్లింగ్ వెబ్‌సైట్ మొరాయించడం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వచ్చిన వార్తలో నిజం లేదని తెలిపారు. నిర్వహనలో భాగంగా కొన్నిసార్లు కొద్ది సమయం పాటు పోర్టల్‌లో కొన్ని అవాంతరాలు ఎదురైనాయన్నది వాస్తవమేనని చెప్పా రు. అంతేగాని దీనివల్ల పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదని పేర్కొన్నారు. రిటర్న్స్ దాఖలుపై వివిధ పత్రికల్లో ఇప్పటికే ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ వివరాలు ఐటిఆర్‌లో స్పష్టంగా తెలిపాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నవంబరు 9నుండి డిసెంబరు 30 మధ్య రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసివుంటే స్పష్టంగా ఐటిఆర్‌లో పేర్కొనాలన్నారు.