జాతీయ వార్తలు

రూ.3,500 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూలై 30: భారత తీర రక్షక దళం (కోస్ట్‌గార్డ్) గుజరాత్ సముద్ర జలాల్లో ఒక వాణిజ్య నౌకలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 1500 కిలోల హెరాయిన్‌ను పట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు ఆదివారం చెప్పారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్, ఇంటెలిజన్స్ బ్యూరో, పోలీసులు, కస్టమ్స్, నౌకాదళం, ఇతర ఏజన్సీలు ఈ సరకు స్వాధీనంపై తదుపరి దర్యాప్తు జరుపుతున్నాయని ఆయన చెప్పారు. గుజరాత్ సముద్ర జలాల్లో కొన్ని నౌకలు అనుమానాస్పదంగా సంచరిస్తున్నాయన్న పక్కా సమాచారం ఆధారం గా కోస్ట్‌గార్డుకు చెందిన ‘సముద్ర పావక్’ నౌక సుమారు రూ.3,500 కోట్ల విలువ కలిగిన దాదాపు 1500 కిలోల హెరాయన్‌ను తీసుకెళ్తున్న ఒక వాణిజ్య నౌకను నిలువరించి స్వాధీనం చేసుకుందని రక్షణ శాఖ ప్రజా సంబంధాల అదికారి అభిషేక్ మతిమన్ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. శనివారం మధ్యా హ్నం 12 గంటల సమయంలో ఈ నౌకను అడ్డగించడం జరిగిందని, నౌకను పోరుబందర్‌కు తీసుకు వస్తున్నారని ఆ ప్రకటన తెలిపింది. ఇప్పటివరకు కోస్ట్‌గార్డ్ స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల్లో ఇదే అతి పెద్ద మొత్తమని కూడా ఆ ప్రకటన తెలిపింది.

చిత్రం.. భారీగా పట్టుబడ్డ హెరాయన్