జాతీయ వార్తలు

క్రాస్ ఓటింగ్‌కు 15కోట్ల ఆఫర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 30: గుజరాత్ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాలు ఆదివారం ఆసక్తికర మలుపు తిరిగాయి. ఈ ఎమ్మెల్యేలందర్నీ ఇక్కడ ఓ రిసార్ట్‌లో ఉంచిన కాంగ్రెస్ పార్టీ, వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టింది. తమ పార్టీనుంచి ఎలాంటి వలసలు జరగడం లేదని, ఇవన్నీ కల్పితాలేనని కాంగ్రెస్ ప్రతినిధి శక్తిసిన్హ్ గోహిల్ స్పష్టం చేశారు. గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తమ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడానికి బిజెపి 15కోట్ల చొప్పున ఆఫర్ చేసిందని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలు ఆనందించడానికి ఇక్కడకు రాలేదని, బిజెపి వలనుంచి తప్పించడానికే, అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తామే వారిని ఇక్కడికి తీసుకువచ్చామని శక్తిసిన్హ్ తెలిపారు. మొత్తం 44 మంది ఎమ్మెల్యేల సమక్షంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 57 మంది గుజరాత్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరిలో ముగ్గురు జూలై 28న బిజెపిలో చేరారు. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు త్వరలోనే తిరిగి పార్టీలోకి రాగలరన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వీరంతా కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు.

చిత్రం.. బిజెపికి వ్యతిరేకంగా నినాదాలిస్తున్న బెంగళూరులోని రిసార్ట్‌లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు