జాతీయ వార్తలు

మాకేం సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 30: గుజరాత్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తమవైపుకు తిప్పుకునేందుకు బిజెపి ఎలాంటి ప్రయత్నం చేయలేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ ఆదివారం నాడిక్కడ స్పష్టం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను బిజెపి తనవైపు తిప్పుకుంటోందన్న కాంగ్రెస్ ఆరోపణలను ఆయన తిరస్కరించారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలి వెళ్లడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ఆరోపణలపై వ్యంగ్యంగా స్పందించిన జావడేకర్ ‘ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏమైనా కొనే వస్తువులా’ అని ప్రశ్నించారు. తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని రక్షించుకోవాలన్నదే కాంగ్రెస్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోందని, అలాగే గుజరాత్‌లో అహ్మద్ పటేల్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందని జావడేకర్ అన్నారు. ఆగస్టు 8న రాష్ట్రంలో కొన్ని రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. బెంగళూరుకు తరలించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ ఆనందోత్సాహాల్లో ఉన్నారని, కాని రాష్ట్ర బిజెపి నాయకులు వరద పీడిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడంలో తలమునకలయ్యారని అన్నారు. కాంగ్రెస్ ఆరోపణలను బట్టి చూస్తే దొంగే పోలీసులపై దాడిచేసినట్లుగా కనిపిస్తోందని, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారంటే దానికి కారణం బిజెపి ఎలా అవుతుందని జావడేకర్ ప్రశ్నించారు.