జాతీయ వార్తలు

తీవ్ర భూకంపాల పరిధిలో 29 నగరాలు, పట్టణాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 30: భారత్‌లోని 29 నగరాలు, పట్టణాలు తీవ్ర భూకంపం సంభవించే జోన్‌లో ఉన్నాయని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సిఎస్) తెలిపింది. ఈ జోన్‌లో దేశ రాజధాని ఢిల్లీతోపాటు తొమ్మిది రాష్ట్రాల రాజధానులు కూడా ఉన్నాయి. హిమాలయా పర్వత ప్రాంతాలు ప్రపంచంలోని తీవ్ర భూకంపం సంభవించే కేంద్రాలలో ఒకటిగా ఎన్‌సిఎస్ పేర్కొంది. తీవ్ర భూకంపం జోన్‌లో ఉన్న నగరాల్లో ఢిల్లీతోపాటు పాట్నా (బిహార్), శ్రీనగర్ (జమ్ము కాశ్మీర్), కోహిమ (నాగాలాండ్), పాండిచేరి, గౌహతి (అసోం), గాంగ్టక్ (సిక్కిం), షిమ్లా (హిమాచల్‌ప్రదేశ్), డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), ఇంఫాల్ (మణిపూర్), చండీగఢ్ నగరాలున్నాయి. ఇవన్నీ జోన్ 5 లేక 4 పరిధిలో ఉన్నాయని తెలిపింది. ఈ నగరాలన్నింటిలో దాదాపు మూడు కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. భూకంపం సంభవించడానికి అవకాశాలు, వాటి తీవ్రతను బట్టి బ్యూర్ ఆప్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) సంస్థ ఆయా ప్రాంతాలను జోన్ 2 నుంచి 5గా విభజించింది. జోన్-2లో అతి తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు సంభవిస్తే, జోన్-5లో తీవ్ర ప్రభావం కలిగించే భూకంపాలు సంభవించే అవకాశాలుంటాయని ఎన్‌సిఎస్ డైరెక్టర్ వినీత్ గెహ్లాట్ వివరించారు. జోన్-5లో దేశంలోని ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్ముకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, గుజరాత్‌లోని కచ్ ప్రాంతం, ఉత్తర బిహార్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నట్లు ఎన్‌సిఎస్ వెల్లడించింది. ఢిల్లీతోపాటు సిక్కిం, ఉత్తరప్రదేశ్‌లోని కొంతం భాగం, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర జోన్-4లో ఉన్నాయి.