జాతీయ వార్తలు

సాక్ష్యాల తారుమారు తీవ్రమైన నేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: గుజరాత్‌లో 2002నాటి గోధ్రా అనంతర అల్లర్ల కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే ఏ చర్య అయినా తీవ్రమైన నేరమేనని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ తన పాత సహచరుడు రైస్ ఖాన్ పఠాన్‌పై విచారణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పఠాన్‌పై విచారణ జరపాలని మెజిస్టీరియల్ ఆర్డర్‌ను గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీస్తా అప్పీల్ చేశారు. సాక్ష్యాలను ఎవరు తారుమారు చేసినా అది తప్పేనని పేర్కొంది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితవారాయ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కోర్టు సాక్షిగా మారేందుకు పఠాన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ఆయనపై విచారణకు అనుసరించిన విధానాన్ని తీస్తా తరపున హాజరైన న్యాయవాది కపిల్ సిబల్ ప్రశ్నించారు. గుజరాత్ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది మహేశ్ జెత్మలానీ పఠాన్‌కు సంబంధించిన ఈ క్రిమినల్ కేసు విచారణతో తీస్తా సెతల్వాద్‌కు కానీ, ఆమె నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు కానీ ఎలాంటి పాత్రా లేదని, హైకోర్టులో కానీ, ఇతరత్రా కానీ వాళ్లు ఈ కేసులో పార్టీలు కారని స్పష్టం చేశారు. కపిల్ సిబల్ వాదనలు విన్న అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. అయితే ఇందుకు సంబంధించి సినాప్సిస్ సిద్ధం చేసుకోవటానికి తీస్తాకు నాలుగు వారాల సమయాన్ని ఇవ్వటానికి ధర్మాసనం నిరాకరించింది. కసిల్ సిబల్ సమయం కోరినప్పుడు ‘అలాంటప్పుడు హైకోర్టు తీర్పుపై ఉన్న స్టేని ఎత్తివేసి విచారణను కొనసాగేందుకు అనుమతిస్తాం. మొత్తం వ్యవహారాన్ని ఆరు నెలలపాటు వాయిదా వేస్తాం’ అని పేర్కొంది.