జాతీయ వార్తలు

పాకిస్తాన్ ఓ నరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్, జూలై 31: పాకిస్తాన్‌లో సుమారు రెండు శాతం ఉన్న పాకిస్తాన్ హిందువులు ఇప్పటికీ నరకాన్ని అనుభవిస్తున్నారు. దశాబ్దాల తరబడి పాకిస్తాన్‌లో హిందువులు సరిహద్దులు దాటి భారత్‌కు వలస వస్తూనే ఉన్నారు. బ్రిటిష్ వారినుంచి స్వాతంత్య్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు పూర్తయిన తరువాత కూడా మానవ చరిత్రలో ఈ అతిపెద్ద వలస కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ నుంచి భారత్‌కు రావటానికి చట్టపరమైన హక్కు లేదన్న కారణంతో వేలమంది హిందువులు పాకిస్తాన్ సరిహద్దుల్లో టెంట్లు వేసుకుని బతుకులు వెళ్లమారుస్తున్నారు. చాలామందికి జీవనోపాధి లేక క్వారీలలో రాళ్లు కొట్టుకుని జీవిస్తున్నారు. వీరి ప్రతి కదలికా అధికారుల కనుసన్నల్లో సాగుతోంది. ‘ఉద్యోగం లేదు. ఇల్లు లేదు, డబ్బు లేదు. ఆహారం లేదు. మేం రైతులం పొలాల్లో పనిచేసే వాళ్లం. కానీ, ఇక్కడ మమ్మల్ని బలవంతంగా రాళ్లో కొట్టిస్తున్నారు’ అని 81 ఏళ్ల ఓ హిందువు వాపోయాడు. ‘మా వరకు మాకు భారత, పాకిస్తాన్ విభజన ఇంకా పూర్తి కాలేదు. తమ దేశానికి తాము తిరిగి రావటానికి హిందువులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తీరా భారత్‌కు వచ్చాక వారికి ఎలాంటి అస్తిత్వం ఉండటం లేదు’ అని జోధ్‌పూర్ శివార్లలో ఉన్న పునరావాస శిబిరంలో ఉంటున్న హిందువులు ఆవేదన చెందుతున్నారు. దాదాపు పదిహేను లక్షల మంది హిందువులు, సిక్కులు 1947లో భారత్, పాకిస్తాన్‌లు విడిపోయిన తరువాత భారత్‌కు వలసవచ్చారు. ఈ క్రమంలో పెద్దఎత్తున హింసాకాండ రేగిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లో 1.6 శాతం హిందువులు మైనార్టీలుగా ఇవాల్టికీ జీవిస్తున్నారు. విభజన జరిగిన మరుసటి క్షణంనుంచే పాకిస్తాన్‌లో తమపై వేధింపులు ప్రారంభమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ డెబ్భై ఏళ్లలో ఒక్కరోజు కూడా మేం ప్రశాంతంగా జీవించలేదు. మేం తిరిగి భారత్‌కు వచ్చి హిందూ సోదరులతో కలిసి ఉండాలని అనుకుంటున్నాం’ అని వారు ఆకాంక్షిస్తున్నారు. ఎక్కువమంది హిందువులు పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్ నుంచి జోధ్‌పూర్‌కు నాలుగు గంటలపాటు ప్రయాణించి చేరుకుంటారు. రాజస్థాన్ సంస్కృతి, భాష, ఆహారపు అలవాట్లతో వారు మమేకమవుతారు. వీరికి తగిన గుర్తింపును, సౌకర్యాలను కల్పిస్తామని మోదీ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇప్పటివరకు ఈ దిశగా చర్యలు మాత్రం తీసుకోలేదు.