జాతీయ వార్తలు

నియోజకవర్గాలు పెంచలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3)ని సవరించకుండా తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల శాసన సభల సీట్లను పెంచడం 2026 సంవత్సరం వరకు సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ తేల్చి చెప్పారు. రాజ్యాంగంలోని 170 (3) ఆర్టికల్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లను 2026 తరువాత జనాభా లెక్కల సేకరణ జరిగేంత వరకు పెంచేందుకు వీలు లేదని అటార్నీ జనరల్ స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు. తెలుగు దేశం సభ్యుడు ఎం. మురళీమోహన్, తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచాలంటే రాజ్యాంగంలోని 170 ఆర్టికల్‌ను ఏ.పి వినజన చట్టంలోని 26వ సెక్షన్‌కు అనుగుణంగా సవరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని 170 ఆర్టికల్‌లో పొందుపరిచిన అంశాలకు లోబడటంతో పాటు ఈ చట్టంలోని 15 సెక్షన్‌కు నష్టం కలిగించకుండా ఆంధ్రప్రదేశ్ శాసన సభ సీట్లను 175 నుండి 225, తెలంగాణా శాసన సభలోని సీట్లను 119 నుండి 153కు పెంచుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన చట్టంలోని సెక్షన్ 26 (1) సూచిస్తోందని అహిర్ వివరించారు. ఈ అంశాన్ని న్యాయ శాఖ పరిశీలనకు పంపించి తమ అభిప్రాయం తెలియజేయాలని కోరామని, దీనిపై న్యాయ శాఖ భారత అట్టార్నీ జనరల్ అభిప్రాయం అడిగిందని, రాజ్యాంగంలోని 170 (3) ప్రకారం 2026 సంవత్సరం తరువాత సేకరించే మొదటి జనాభా లెక్కలను ప్రకటించనంత వరకు రెండు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచేందుకు వీలు లేదని భారత ఆట్టార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు అని హన్స్‌రాజ్ గాంగారామ్ అహిర్ తమ రాతపూర్వక సమాధానంలో ప్రకటించారు. ఈ కారణాల చేత ఏ.పి విభజన చట్టంలోని 26వ సెక్షన్‌కు అనుగుణంగా రాజ్యాంగంలోని 170 ఆర్టికల్‌ను సవరించనంత వరకు రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచటంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదని అహిర్ స్పష్టం చేశారు.