జాతీయ వార్తలు

ఆధార్ ఆధారంగా.. వ్యక్తిగత నిఘా అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: కేవలం ఆధార్ ఆధారంగా వ్యక్తుల వ్యక్తిగత వివరాలపై నిఘా పెట్టడం సాధ్యంకాదని యుఐడిఎఐ మంగళవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. దేశంలోని పౌరులకు ఆధార్ కార్డులను జారీ చేసే ఈ సంస్థ‘ఆధార్‌ను నిఘా కోసం వాడుకునేందుకు ఎంతమాత్రం వీలులేదు. వ్యక్తుల వ్యక్తిగత వివరాలను కాపాడేందుకు చట్టంలో ఎన్నో రక్షణ కవచాలున్నాయి. అలాగే ఇందుకు సంబంధించిన బలమైన వ్యవస్థలూ ఉన్నాయి. ఈ రకమైన నిఘాకు కోర్టు అనుమతించినా కూడా అది ప్రభుత్వానికి సాధ్యమయ్యేపని కాదు’అని స్పష్టం చేసింది. వ్యక్తిగత గోప్యత, ప్రాథమిక హక్కు అంటూ ఎన్నో వాదనలు వస్తున్నాయని,ప్రస్తుత ఆన్‌లైన్ యుగంలో ఏదీ వ్యక్తిగతం కాదని అదనపుసొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తొమ్మిది మంది న్యాయమూర్తులు రాజ్యాంగ బెంచ్‌కు స్పష్టం చేశారు. వ్యక్తి గోప్యతను ప్రాధమిక హక్కుగా కోర్టు పరిగణించినట్టయితే దాని ప్రభావం ఆధార్‌పై తీవ్రంగానే ఉంటుందని ఈ ఏజన్సీ తెలిపింది. వ్యక్తిగత డాటా రక్షణకు సంబంధించి తగిన సూచనలు చేసేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బిఎన్ శ్రీకృష్ణ సారధ్యంలో పది మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. ప్రస్తుత ఆన్‌లైన్ యుగంలో వ్యక్తుల వ్యక్తిగత వివరాలను సురక్షితంగా ఉంచేందుకు సమగ్రమైన రీతిలో మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని మంగళవారం జరిగిన వాదోపవాదాల సందర్భంగా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంటే నిర్ధేశిత అవసరాలకు మాత్రమే ఈ వివరాలను ఉపయోగించుకునేలా ఈ మార్గదర్శకాలు ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖెహార్ సారధ్యంలోని రాజ్యాంగ బెంచ్ తెలిపింది. భారత జనాభా పరిమాణాన్ని దృష్టిలోపెట్టుకుని అత్యంత సమగ్ర రీతిలో ఈ మార్గదర్శకాల రూపకల్పన జరగాలని కోర్టు పేర్కొంది. ప్రైవసీని మానవ హక్కుగా పరిగణిస్తూ 1948లో ఆమోదించిన అంతర్జాతీయ ఒప్పందంపై భారత్ కూడా సంతకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయమూర్తులు గుర్తుచేశారు.