జాతీయ వార్తలు

యమునా గట్లపై చెత్తను తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: యమునా నది గట్లపై పేరుకుపోయిన చెత్తాచెదారాలను మూడు వారాల్లోగా తొలగించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది. విచక్షణారహితంగా చెత్త పడేయడమే ఈ నది కలుషితం కావడానికి ప్రధాన కారణమని కూడా ట్రిబ్యునల్ పేర్కొంది, ఈ ఆదేశాలను అమలుచేసే బాధ్యత ఢిల్లీ, యుపి నీటిపారుదల శాఖలదేనని కూడా ఎన్‌జిటి చైర్‌పర్సన్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం స్పష్టం చేసింది. పర్యావరణం, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని, నది తిరిగి తన మామూలు స్థితికి చేరుకునేందుకు దోహదపడాలని బెంచ్ సూచించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఒక ప్రణాళిక ప్రకారం, శాస్ర్తియ పద్ధతిలో అమలవుతోందని, అందువల్ల ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులను సహించేది లేదని బెంచ్ స్పష్టం చేసింది.
యమునా నది శుద్దీకరణ ప్రాజెక్టు అమలును పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన ప్రధాన కమిటీని ట్రిబ్యునల్ పునర్వ్యవస్థీకరించడంతో పాటుగా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి శశి శేఖర్‌ను ప్రత్యేక ఆహ్వానితుడిగా కమిటీలో చేర్చింది. అంతేకాకుండా యమునా నది సుందరీకరణ ప్రాజెక్టు అమలుకోసం దీనిలో భాగస్వాములైన ఢిల్లీ, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 8వ తేదీ ట్రిబ్యునల్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. కాగా యమునా నది సుందరీకరణ పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడడానికి అవసరమైన చర్యలను ఢిల్లీ జల బోర్డు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ట్రిబ్యునల్‌కు తెలియజేశారు.