జాతీయ వార్తలు

ఎన్‌హెచ్‌గా రాజీవ్ రోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: హైదరాబాద్ -సిద్దిపేట -కరీంనగర్ -రామగుండం మధ్యనున్న 240 కిలోమీటర్ల రాజీవ్ రహదారిని అప్‌గ్రేడ్ చేసి జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్ర ఉపరితల రవాణ మంత్రి నితిన్ గడ్కరీ సూత్రప్రాయంగా అంగీకరించారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తెరాస సభ్యుడు బి వినోద్‌కుమార్ అడిగిన అనుబంధ ప్రశ్నకు గడ్కరీ బదులిస్తూ రాజీవ్ రహదారిని అప్‌గ్రేడ్ చేయాలంటే మొదట ఇందుకు సంబంధించిన కాంట్రాక్టర్‌కు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. రోడ్డు విలువను అంచనా వేసేందుకు తమ శాఖ విధానాన్ని రూపొందిస్తోందని, అనంతరం కాంట్రాక్టర్‌కు పరిహారం చెల్లించి అప్‌గ్రెడేషన్ చేపడతామని గడ్కరీ హామీ ఇచ్చారు. పదిహేను రోజుల్లో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎలాంటి పక్షపాతం చూపించటం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రహదారుల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ సభ్యుడు చేసే సిఫార్సులను నూటికి నూరుశాతం ఆమోదిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. తొలుత వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర పాలనలో జాతీయ రహదారుల అంశానికి సంబంధించినంత వరకు తెలంగాణకు తీరని నష్టం వాటిల్లిందని చెప్పారు. రోడ్ల విస్తరణకు ఎదురవుతున్న భూసేకరణ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రయత్నిస్తోందని తెలిపారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఉన్న 240 కిలోమీటర్ల రోడ్డును అప్‌గ్రేడ్ చేసేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించి పని పూర్తి చేయలేదన్నారు. 240 కిలోమీటర్లలోని 82 కిలోమీటర్ల రహదారిపై 60 మలుపులు ఉన్నాయని, దీనివలన ప్రమాదాలు సంభవిస్తున్నాయి అని అన్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం రోడ్డును జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయాలని గడ్కరీకి సిఎం విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని నితిన్ గడ్కరీని సభ్యుడు వినోద్ కోరారు.