జాతీయ వార్తలు

భూసేకరణ తరువాతే తీర ప్రాంత రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ చేసిన అనంతరం చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు తీరప్రాంత రోడ్డు నిర్మాణం చేపట్టే విషయం పరిశీలిస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ ఒక్క ప్రాజెక్టుకు దాదాపు 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుదంటూ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు తక్కువ వడ్డీకి రుణం తెచ్చే విషయం పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొదట భూసేకరణ పనిని పూర్తి చేయవలసి ఉన్నదంటూ భూసేకరణ జరిగిన తరువాత దీని విషయం పరిశీలిస్తామన్నారు. రామ్మోహన్ నాయుడు తీర ప్రాంత రోడ్డు నిర్మాణం కోసం తన వద్దకు ఇప్పటికి ఐదు సార్లు వచ్చారు, యువ ఎంపీ బాగా పని చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి చెందిన ఏ ఎంపి తన వద్దకు వచ్చినా వారి పని చేసి పెడుతున్నానని గడ్కరీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 4193 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉన్నది, ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చిన తరువాత దీనికి మరో 293 కిలోమీటర్లను చేర్చామని, మరో 836 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిలో చేర్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదించినట్లు గడ్కరీ వెళ్లడించారు. దేశంలో 92 లక్షల కిలోమీటర్ల రహదారులుంటే ఇందులో 96 వేల కిలోమీటర్లు జాతీయ రహదారిగా ఉన్నది, దాదాపు నలభై శాతం వాహనాల రాకపోకలు కేవలం రెండు శాతం రోడ్లపై జరుగుతాయని అయన వివరించారు. దీని మూలంగా ప్రతి సంవత్సరం ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగి ఒకటిన్నర లక్షల మంది మరణించే వారని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం పదివేల కంటే ఎక్కువ వాహనాల రాకపోకలు ఉన్న రోడ్లను నాలుగు లేన్ల దారి, ఇరవై వేల కంటే ఎక్కువ వాహనాల రాకపోకలు ఉన్న రహదారులు ఆరు లేన్ల దారిగా మార్చివేయాలని నిర్ణయించి అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం జాతీయ రహదారిని 96 వేల కిలోమీటర్ల నుండి లక్షా డెబ్బై ఐదు వేల కిలోమీటర్లకు పెంచామన్నారు. తమ శాఖకు ఉన్న 65 వేల కోట్ల బడ్జెట్ నుండి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు భూసేకరణ కోసం వెచ్చించాల్సి వస్తోందని అన్నారు. ఈ కారణం చేతనే రోడ్ల విస్తరణ పెద్ద ఎత్తున చేపట్టలేకపోతున్నామన్నారు. రాష్ట్రంలో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న రోడ్డు వంతెనలను పునర్నిర్మించేందుకు కేంద్రం ముందుకు రావాలంటూ రామ్మోహన్ నాయుడు చేసిన సూచనకు గడ్కరీ బదులిస్తూ ఈ సూచనను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. దేశంలో 100 వంతెనలు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉన్నదని గడ్కరీ వెళ్లడించారు.