జాతీయ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలను అడ్డుకోలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 6: కేరళలో రాజకీయ హింసాకాండకు అధికార సిపిఎం పార్టీయే కారణమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను నిర్మూలించేందుకు సిపిఎం తన కార్యకర్తలను వినియోగించుకుంటోందని ఆదివారం నాడిక్కడ జరిగిన ఓ సంతాపసభలో జైట్లీ అన్నారు.
హింసాకాండకు పాల్పడటం ద్వారా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఎంతమాత్రం అణచివేయజాలరని స్పష్టం చేసిన జైట్లీ ‘దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ రకమైన దాడులు జరిగితే తక్షణం స్పందించే వ్యక్తులు, తమ సొంత రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదు’ అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన దాడులకు అధికార సిపిఎం పార్టీయే కారణమని జైట్లీ దుయ్యబట్టారు.
బద్ధ శత్రువులు సైతం ఇంత అనాగరికంగా హత్యాకాండకు పాల్పడరని, ఇటీవల 34ఏళ్ల ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాజేష్ ఎడవకోడె హత్యను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. కోజికోడ్‌లో సిపిఎం కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రాజేష్ కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. రాజేష్ శరీరంపై 70 నుంచి 80 వరకు కత్తిపోటు గాయాలున్నాయని పోస్టుమార్టం నివేదిక పేర్కొందని, అంటే ఎంత అనాగరికంగా హత్యాకాండ జరుగుతోందో అర్థమవుతోందని అన్నారు. బద్ధ శత్రువులు సైతం ఇంత దారుణంగా ప్రవర్తించరని అన్నారు. ఇటీవలి కాలంలో బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై హత్యాకాండలు, గృహ దహనాలు తరస్థాయికి చేరాయని, రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ హత్యకాండను నిరోధించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇలావుండగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న హత్యాకాండను నిరోధించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజయన్‌కు ఫోన్ చేసి బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని కోరారు.