జాతీయ వార్తలు

సంకల్ప దివస్‌గా పంద్రాగస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: స్వాతంత్య్ర దినోత్సవాన్ని సంకల్పపర్వంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సందర్భంగా నూతన భారత్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో పౌరులం తా గట్టిగా సంకల్పించుకోవాలని, ప్రజలంతా సరికొత్త ఆలోచనలను పంచుకోవాలని కేంద్రం సూచించింది. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆగస్టు 15న క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ, దేశం నుంచి మతవాదం, కులవాదం, అవినీతి, ఉగ్రవాదం, పేదరికం, అపరిశుభ్రతలు దేశంనుంచి వెళ్లిపోవాల ని కోరుకుంటూ ప్రతిజ్ఞ చేయాలని కేంద్రం సూచించింది. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపడంతో పాటు క్షేత్ర స్థాయి వరకూ ఉద్యమ విశిష్టతను తీసుకువెళ్లాలని, దీన్ని వరుసగా ఐదేళ్లు కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. 2022 నాటికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతుంది. ఈ ఐదేళ్ల కాలంలో దేశాన్ని సరికొత్తగా నిర్వచించుకునే వీలుంటుందని కేంద్రం పేర్కొం ది. దేశ ప్రజలు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ న్యూఇండియా డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి న్యూ ఇండియా ప్రతిజ్ఞ చేయాలని, మిగిలిన వారు కూడా ఇలా చేసేలా ప్రోత్సహించాలని, ఈ సందేశాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అందరికీ పంపిస్తుందని పేర్కొంది.