జాతీయ వార్తలు

అన్ని పిటిషన్ల విచారణకు ‘అయోధ్య’పై ప్రత్యేక బెంచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: అయోధ్య వివాదంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను విచారించటానికి సుప్రీం కోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అయోధ్య కేసును ఆగస్టు 11నుంచి విచారణ చేపడుతుంది. అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీద్‌కు చెందిన 2.77 ఎకరాల భూమి మూడు పార్టీలకు సమానంగా విభజిస్తూ ముగ్గురు జడ్జిల ధర్మాసనం 2:1 మెజార్టీతో తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. మొత్తం కేసును వీలైనంత త్వరగా విచారించటంపై తొందర్లోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉందని, వీటిని తక్షణం విచారించాలని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.