జాతీయ వార్తలు

చర్చలకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఆగస్టు 8: హింసాకాండను విడనాడి డార్జిలింగ్ ఉద్యమ పార్టీలన్నీ చర్చలకు రావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఇక్కడ పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ ఉద్యమం కారణంగా 550 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించిందని శాసభసభలో తెలిపారు. వరుస బంద్‌ల కారణంగా, స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు, టూరిజం దెబ్బతిందని అన్నారు. డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో నిరవధిక బంద్‌కు గూర్ఖా జనమోర్చా, ఇతర కొండ ప్రాంత పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో మమత మాట్లాడారు. ఈ నిరవధిగా సమ్మె గత 55 రోజులుగా కొనసాగడంతో అసెంబ్లీలో గళం విప్పిన మమత ‘డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్‌లో అంతర్భాగం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం’ అని తెగేసి చెప్పారు. ప్రతి పది పదిహేను సంవత్సరాలకు ఓసారి డార్జిలింగ్‌లో ఈ రకమైన ఉద్యమాలు రావడం మామూలైందని వ్యాఖ్యానించారు. గూర్ఖాలాండ్ ప్రాదేశిక పాలన మండలి ఐదేళ్ల కాలపరిమితి పూర్తవుతోందని, దానికి ఎన్నికలు జరగాల్సి ఉందని ఆమె తెలిపారు.

చిత్రం.. కోల్‌కతాలో మంగళవారం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మమతా బెనర్జీ