జాతీయ వార్తలు

పురోహిత్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా వేసిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని కోరుతూ 2008 మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుల్లో ఒకరయిన లెఫ్టెనెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన తీర్పును గురువారం వాయిదా వేసింది. పిటిషన్‌పై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయమూర్తులు ఆర్‌కె అగర్వాల్, ఎఎం సప్రేలతో కూడిన బెంచ్ తెలిపింది. పురోహిత్ తొమ్మిదేళ్లుగా జైల్లో ఉన్నాడని, అయినా అతనిపై అభియోగాలు నమోదు చేయలేదని వాదనల సందర్భంగా ఆయన తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే చెప్పారు. పురోహిత్‌పై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం (మొకోకా) కింద అభియోగాలను ఇప్పటికే ఉపసంహరించుకున్నారని, అందువల్ల మధ్యంతర బెయిలుకు ఆయన అన్ని విధాల అర్హుడని కూడా సాల్వే అన్నారు. కాగా, పురోహిత్‌కు వ్యతిరేకంగా కొంత సాక్ష్యముందని, అభియోగాలు నమోదు చేయడానికి ఆ సాక్ష్యం తోడ్పడుతుందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ మనీందర్ సింగ్ చెప్పారు. కాగా, ఈ కేసులో మరో నిందితురాలయిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకుర్‌కు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయాలంటూ దాఖలయిన పిటిషన్‌ను కోర్టు అక్టోబర్ 10న విచారిస్తుంది. తన బెయిలు పిటిషన్‌ను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పురోహిత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఠాకుర్‌కు బెయిలు మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బాంబు పేలుళ్ల బాధితుల్లో ఒకరయిన నిసార్ అహ్మద్ హాజీ సయ్యద్ బిలాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఠాకుర్ బెయిలును రద్దు చేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గత నెల 28న మహారాష్ట్ర ప్రభుత్వం సమాధానాన్ని కోరింది.

చిత్రం..శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్