జాతీయ వార్తలు

ఎన్డీఏలోకి జెడి(యు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఆగస్టు 19: ఎన్డీఏ కూటమిలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతత్వంలోని జెడి(యు) మళ్లీ భాగస్వామిగా మారింది. శనివారం ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ సీనియర్ నాయకుడు కెసి త్యాగి విలేఖరులకు సమావేశం వివరాలను తెలియజేస్తూ పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్‌తో విభేదాల తర్వాత పార్టీలో ఎలాంటి చీలికా రాలేదని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు నితీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన జెడి (యు) జాతీయ కార్యవర్గ సమావేశం ఎన్డీఏలో భాగస్వామి కావడానికి సంబంధించి ఒక తీర్మానాన్ని ఆమోదించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన త్యాగి చెప్పారు. అంతేకాకుండా ఆర్‌జెడి, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా కూటమినుంచి వైదొలగి బిహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బిజెపితో చేతులు కలపాలన్న రాష్ట్ర జెడి(యు) విభాగం నిర్ణయానికి కూడా జాతీయ కార్యవర్గం ఆమోదముద్ర వేసినట్లు త్యాగి తెలిపారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల నితీశ్ కుమార్‌తో జరిపిన సమావేశంలో జెడి(యు)ను ఎన్డీఏలోకి ఆహ్వానించారని, జాతీయ కార్యవర్గం దానికి ఆమోదం తెలిపిందని, ఇప్పుడు తాము ఎన్డీఏలో భాగస్వాములమని త్యాగి చెప్పారు. విలేఖరుల సమావేశంలో
త్యాగితో పాటు పార్టీ సీనియర్ నేతలు ఆర్‌సిపి సింగ్, హర్‌బంశ్, పవన్ వర్మ తదితరరులు కూడా పాల్గొన్నారు.
బిహార్‌లో పార్టీకి చెందిన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీలు, సీనియర్ నేత శరద్ యాదవ్‌తో సంప్రదించి నితీశ్ కుమార్ నియమించిన పార్టీ కమిటీలకు చెందిన ఆఫీస్ బేరర్లు అందరూ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయి, ఈ నిర్ణయంలో పాలు పంచుకున్నారని ఆయన చెప్పారు. అలాంటప్పుడు జెడి (యు)లో చీలిక ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 27న నగరంలో ఆర్‌జెడి నిర్వహించే ర్యాలీ దాకా వేచి చూశాక శరద్ యాదవ్‌పై చర్య తీసుకునే విషయం ఆలోచిస్తామని త్యాగి చెప్పారు. కాగా , ఎన్డీయేలో చేరిన జెడియుకు కేంద్ర కేబినెట్‌లో రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని బిజెపి వర్గాలు చెప్తున్నాయి.