జాతీయ వార్తలు

హోటల్‌ను మళ్లీ పరిశీలించనున్న ఫోరెన్సిక్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: మూడేళ్ల క్రితం కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ శవమై కనిపించిన ఢిల్లీ ఫైవ్‌స్టార్ హోటల్‌లోని సూట్‌ను మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించడానికి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ బృందం మరోసారి పరిశీలించనుంది. ఈ సూట్‌కు వేసిన సీలును తెరవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన హోటల్ మేనేజిమెంట్ ఈ విషయాన్ని శనివారం న్యాయస్థానానికి తెలియజేసింది. కాగా, హత్య జరిగినప్పటినుంచి వేసి ఉన్న ఈ సూట్ సీల్‌ను తక్షణం తొలగించాలని గత నెల 21న తనకన్నా ముందున్న న్యాయమూర్తి ఆదేశించినప్పటికీ ఎందుకు ఆలస్యం చేశారంటూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధర్మేంద్ర సింగ్ ఢిల్లీ పోలీసులను నిలదీశారు. కాగా, సెప్టెంబర్ 1న సిఎఫ్‌ఎస్‌ఎల్ బృందం మరోసారి హోటల్ సూట్‌ను సందర్శించనున్నట్లు శుక్రవారం హోటల్‌కు ఒక లేఖ అందిందని హోటల్ తరఫు న్యాయవాది న్యాయమూర్తికి చెప్పారు. దీనిపై జడ్జి స్పందిస్తూ, తమకు మరికొంత సమయం కావాలని హోటల్‌కు తెలియజేయడానికి రెండు నెలలు ఎందుకు తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించారు. కాగా, కోర్టు ఆదేశాలను పాటించడానికి సంబంధించిన నివేదికను సమర్పించడానికి మరో అవకాశం ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని మన్నించిన జడ్జి సెప్టెంబర్ 4న నివేదిక దాఖలు చేయాలని ఆదేశించారు.