జాతీయ వార్తలు

ఖాయమైన విస్తరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారాంతానికి కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు తమిళనాడులో పర్యటించాల్సి ఉన్న బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని కొందరు కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశం కావటం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
‘‘పార్టీ అధ్యక్షుడు తన చెన్నై పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆయన మరి కొన్ని రోజుల పాటు ముఖ్యమైన కార్యాల కోసం దేశ రాజధానిలో ఉండవలసిన అవసరం ఉంది.’’ అని సీనియర్ పార్టీ నాయకుడు ఒకరు వెల్లడించారు. అమిత్ షా మంగళవారం చెన్నై పర్యటనకు వెళ్లవలసి ఉండింది. అమిత్ షా పర్యటన ఏర్పాట్లు చూసేందుకు బిజెపి జాతీయ ప్రదాన కార్యదర్శి మురళీధర్ రావు ఇప్పటికే చెన్నైకి చేరుకున్నారు. కానీ షా పర్యటన వాయిదా పడినట్లు వర్తమానం వచ్చింది.
తమిళనాడులో అన్నా డిఎంకె రెండు వర్గాలు ఏకం కావటంతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె సన్నిహితులపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అమిత్ షా చెన్నై పర్యటన అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. బిజెపి అధినాయకత్వం మార్గదర్శకత్వం మేరకే అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు కలిసిపోవటం అందరికి తెలసిందే. తమిళనాడులో బిజెపిని బలపరిచేందుకు పార్టీ అధినాయకత్వం అన్నాడిఎంకెను ఉపయోగించుకుంటోంది. అమిత్ షా చెన్నై పర్యటన కూడా ఈ లక్ష్య సాధన కోసం ఏర్పాటు చేసింది. అయితే అమిత్ షా తన చెన్నై పర్యటనను మార్చుకోవటంతో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ వంటి అత్యంత ముఖ్యమైన పనులు రావటం వల్లనే ఆయన చెన్నై పర్యటనను మార్చుకున్నారని పార్టీ సీనియర్లు స్పష్టంగానే చెప్తున్నారు.
కొత్త విస్తరణలో ఇటీవలే ఎన్‌డిఏలో చేరిన జెడి యుకు కేంద్ర మంత్రివర్గంలో ఒక క్యాబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో జెడియు చేరిక గురించి చర్చించేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జెడియు అధ్యక్షుడు నితీష్‌కుమార్ ఢిల్లీకి వస్తున్నారు. ఆయన నరేంద్ర మోదీ, అమిత్ షాతో చర్చలు జరిపిన వెంటనే కేంద్ర మంత్రివర్గం విస్తరణ తేదీ ఖరారు అవుతుందని అంటున్నారు. అదే విధంగా విలీనమైన అన్నాడిఎంకెకు రెండు పదవులు దక్కవచ్చని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. సీనియర్ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఉపరాష్టప్రతి పదవి చేపట్టటం, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లటం, పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే మరణించటంతో కేబినెట్‌మంత్రి స్థాయిలో మూడు ముఖ్యమైన ఖాళీలు ఏర్పడ్డాయి. నజ్మాహెప్తుల్లా మంత్రి పదవికి రాజీనామా చేసి మణిపూర్ గవర్నర్ పదవి చేపట్టారు. ఈ ఖాళీలను భర్తీ చేయటంతో పాటు కొన్ని మిత్రపక్షాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించవలసి ఉన్నది. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ రక్షణ శాఖ, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సమాచార శాఖ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు మరి కొందరు మంత్రులు కూడా అదనపు బాధ్యతల భారం మోస్తున్నారు. వీటన్నింటిని సర్దుబాటు చేయటంతో పాటు 2019 లోకసభ ఎన్నికల కోసం ఎన్నికల మంత్రివర్గాన్ని మోదీ తీర్చి దిద్దవలసి ఉన్నది. అందుకే నరేంద్ర మోదీ త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపడతారని అంటున్నారు.