జాతీయ వార్తలు

కలిసుంటే కలదు సుఖం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: భారత, చైనా సైన్యాల మధ్య సిక్కిం సెక్టార్‌లోని డొక్లామ్‌లో రెండు నెలల నుండి నెలకొన్న ఉద్రిక్తత తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. భారత దేశంపై నిన్నటివరకు వ్యంగ్య బాణాలు విసరటంతోపాటు విషం కక్కిన చైనా పత్రికలు తమ వైఖరిని మార్చుకుని రెండు దేశాలు పరస్పర విశ్వాసంతో పనిచేయాలి, భారత్ గజము, చైనా డ్రాగన్ కలిసి నృత్యం చేయవచ్చునని సూచించాయి. డోక్లామ్ విషయంలో చైనా నుండి సహేతుక ముందడుగు ఉంటుందనే ఆశాభావాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యక్తం చేశారు. డోక్లామ్ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ఢిల్లీలో ఐటిబిపి పిప్పింగ్ ఉత్సవంలో మాట్లాడుతూ డోక్లామ్ సమస్యను పరిష్కరించేందుకు చైనా త్వరలోనే ఒక సహేతుక ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారతదేశం శాంతిని కోరుకుంటోంది తప్ప శతృత్వం కాదనే సందేశాన్ని పొరుగు దేశాలకు పంపిస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. జీవితంలో స్నేహితులను మార్చుకోవచ్చు కానీ పొరుగువారిని మార్చుకోలేము, అందుకే పొరుగువారు, పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఎంతో ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగు దేశాధినేతలను ఆహ్వానించటం కరచాలనం చేసేందుకు కాదు, వారితో సత్సంబంధాలు పెంచుకునేందుకేనని హోం శాఖ మంత్రి వివరించారు. భారతదేశం ఎప్పుడు కూడా దూకుడుగా వ్యవహరించలేదు, దాడికి ఎప్పుడూ ఉపక్రమించలేదు అయితే దేశ భద్రత వియంలో సర్దుబాటుకు ఒప్పుకోదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ సరిహద్దులను రక్షించేందుకు భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయి, భారత దేశంపై దాడి చేయగలిగే దేశం ప్రపంచంలోనే లేదు అని ఆయన అన్నారు. భారత-చైనా సరిహద్దుల్లో ఐటిబిపి చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. గృహ సదుపాయం కొరత, ప్రమోషన్ల మూలంగా ఐటిబిపి ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రాజ్‌నాథ్ సింగ్ వారికి హామీ ఇచ్చారు.
ఇదిలావుండగా ఇంతకాలం భారత్, భారత సైన్యంపై చిందులు వేసిన చైనా పత్రికలు తమ వైఖరిని మార్చుకుంటున్నాయి. చైనా, భారత్ సమస్యలను పరిష్కరించుకునేందుకు సంయమనంతో వ్యవహరించాలని చైనా తరపున బాకా ఊదే పత్రిక షిన్‌హువా సోమవారం సూచించింది. డోక్లామ్ సమస్య పరిష్కానికి రెండు దేశాలు ఉదారంగా వ్యవహరించాలని ప్రతిపాదించి అందరిని ఆశ్చర్యపరిచింది. షినహువా టివి సోమవారం ఒక నిమిషం ముప్పై ఐదు సెకండ్ల వీడియో వార్తలో ఈ సూచన చేసింది. షిన్‌హువా గత వారం ఇండియా టాక్ మొదటి వీడియో వార్తలో భారత దేశంపై వ్యంగ్య బాణాలు విసరటం తెలిసిందే. అయితే అదే టివి ఇండియా టాక్ రెండో ఎపిసోడ్ వార్తలో డోక్లామ్ సమస్య పరిష్కారానికి రెండు దేశాలు హుందాగా వ్యవహరించాలని సూచించటం గమనార్హం. చైనా, భారత్ పుట్టుకతో శతృవులు కాదు, అత్యంత పునాతన కాలంనుండి రెండు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి, అందుకే భారత్ బేషరతుగా తమ సైనికులను చైనా భూభాగం నుండి విరమించుకోవాలని సూచించింది. శాంతియుతంగా, ప్రశాంతంగా కలిసి జీవించటం వలన రెండు దేశాల 2.70 మిలియన్ ప్రజలకు మేలు జరుగుతుందని కూడా సూచించింది. పరిస్థితులు విషమించి యుద్ధానికి దారితీస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి, రెండు దేశాలు తమ మధ్య విశ్వాసాన్ని పెంచుకునేందుకు కృషి చేయాలని పేర్కొంది. చైనా డ్రాగన్, భారత గజం కలిసి నృత్యం చేసేందుకు ఆసియా ఖండంలో కావలసినంత అవకాశం ఉన్నదని షిన్‌హువా వీడియో వార్తను ముగించింది.