జాతీయ వార్తలు

జాప్యం దేనికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోలీసు పోస్టుల భర్తీ విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోందని సుప్రీం కోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివిధ పోలీసు పోస్టుల భర్తీకి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో నాలుగు వారాల్లో అఫిడవిట్ల రూపంలో తెలియజేయాలని 21 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఇందుకు సంబంధించిన కేసును విచారించింది. బిహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 4.3లక్షల పోలీసు పోస్టులను నిర్ణీత కాల వ్యవధిలో భర్తీ చేసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ‘మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ తమ రాష్ట్రాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నాయో నాలుగు వారాల్లో అఫిడవిట్లు సమర్పించాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. 2013లో లాయర్ మనీష్ కుమార్ పోలీస్ ఖాళీలు భర్తీ చేయటం లేదంటూ పిటిషన్ దాఖలు చేశారు. వివిధ పోలీస్ సర్వీస్‌ల్లో ఏళ్ల తరబడి ఖాళీలు నింపకపోవటంవల్ల దేశ వ్యాప్తంగా శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉత్పన్నమవుతోందని మనీష్ ఆరోపించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం పోలీస్ ఖాళీల భర్తీకి సంబంధించి రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం వివిధ స్థాయిల్లో 17,504 ఖాళీల భర్తీకి సంబంధించి ఓ రోడ్ మ్యాప్‌ను సుప్రీం కోర్టుకు నివేదించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1నాటికి 9862 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపింది. మిగతా 7642 పోస్టుల నియామకాలను 2019 మార్చి 31నాటికి పూర్తి చేస్తామని తెలిపింది. ఈ రోడ్‌మ్యాప్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం అంగీకరించింది. గుజరాత్ ప్రభుత్వం కూడా వచ్చే ఏడాది ఆగస్టు 31లోగా అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని రోడ్‌మ్యాప్‌ను సమర్పించింది.