జాతీయ వార్తలు

పసల్ బీమా యోజనతో 90 లక్షల మందికి లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల బీమా పథకం వల్ల 90 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరినట్టు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడిక్కడ వెల్లడించారు. 2016-17 సంవత్సరానికి సంబంధించి పథకం అమలు తీరుతెన్నులపై ప్రధాని మోదీ అధ్యక్షత ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశం వివరాలను పిఎంఓ ఓ ప్రకటనలో వివరించింది. ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన కింద రైతులకు ఇప్పటికే 7,700 కోట్ల రూపాయల పరిహారం అందించినట్టు ప్రధాని స్పష్టం చేశారు. పంటల బీమా పథకం క్లయిమ్‌లు సత్వరం పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలపై అధికారులు ప్రధానికి వివరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్ఫోన్లు, రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ డాటా, డ్రోన్‌లను ఉపయోగించుకుంటున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి మట్టి పరిశోధన కార్డులు, ప్రధాన్ మంత్రి పసల్ బీమా యోజన వంటి పథకాలపై ప్రధాని సమీక్షించారని పిఎంఓ ప్రకటనలో తెలిపారు. మట్టి పరీక్షల కార్డులు(సాయల్ హెల్త్ కార్డు)లు పంపిణీ త్వరలోనే పూర్తవుతుందని 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రధానికి వివరించాయి.
రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో సాయిల్ హెల్త్ కార్డులుండాలని మోదీ సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులను మోదీ ఆదేశించారు. వ్యవసాయ మంత్రిత్వశాఖ, నీతి ఆయోగ్, పిఎంఓ అధికారులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

చిత్రం..ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన పథకం అమలుపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ