జాతీయ వార్తలు

‘నీట్’ నిర్వహణపై కేంద్రానికి నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ , ఆగస్టు 21: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్టు (నీట్) నిర్వహణలో జరిగిన అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరిపించాలని దాఖలైన పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పిజి కోర్సుల్లో ప్రవేశాలకు 2016లో నిర్వహించిన నీట్‌లో అనేక అవకతవకలు జరిగాయని పిటీషనర్ పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరి శంకరరావులతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ప్రొమెట్రిక్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ప్రోమెట్రిక్స్ సంస్థ సిఎంఎస్ ఐటి సర్వీసుల సంస్థతో సబ్ కాంట్రాక్టు కుదుర్చుకుందని, వారి ఇంజనీర్లను, సూపర్‌వైజర్లను, ఇతర సిబ్బందిని నీట్ పిజి నిర్వహణకు వినియోగించుకుందని పిటీషనర్ పేర్కొన్నారు. పరీక్ష జరిగి చాలా రోజులైనా సమగ్ర నివేదిక ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతుందో సంబంధిత అధికారులు వారం రోజుల్లో ఒక నివేదిక కోర్టు ముందుంచాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేశారు.