జాతీయ వార్తలు

పళనిని బర్తరఫ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 22: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని బర్తరఫ్ చేయాలని టిటివి దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు మంగళవారం గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావును కలిసి డిమాండ్ చేశారు. పళనిస్వామి సిఎం పదవికి అనర్హుడని, ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కోల్పోయారని వారు ఆరోపించారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనం అనైతికమని వారు గవర్నకు ఫిర్యాదు చేశారు. ‘ముఖ్యమంత్రి పళనిస్వామిపై మాకు విశ్వాసం లేదు. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన పన్నీర్ సెల్వంకు ఉప ముఖ్యమంత్రి పదని ఎలా కట్టబెడతారు? తక్షణం పళనిని సిఎం పదవి నుంచి బర్తరఫ్ చేయండి’ అని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. 122 మంది అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తేనే పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారని ఓ శాసన సభ్యుడు తెలిపారు. రెండు గ్రూపులను విలీనం చేయాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేలందరితో సంప్రదింపులు జరపాలని, అలాంటిది ఎవరితోనూ చర్చించకుండా పళనిస్వామి ఏకపక్షంగా వ్యవహరించారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ‘పళనిస్వామి తీరును గవర్నర్‌కు విన్నవించాం. తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాం’ అని వారన్నారు. ధర్మయుద్ధం అంటూ గతంలో బీరాలు పలికిన పన్నీర్ సెల్వం పదవికి ఆశపడే విలీనం ప్రతిపాదన తెచ్చి డిప్యూటీ సిఎం పదవి కొట్టేశారని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఆరోపించారు. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్‌తో భేటీ అయిన విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు ధ్రువీకరించాయి. అయితే చర్చల సారాంశాన్ని మాత్రం వారు వెల్లడించలేదు. అలాగే గవర్నర్‌ను కలిసి ఎమ్మెల్యేల వివరాలూ తెలపలేదు. ఇలాఉండగా సోమవారం దినకరన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి 18 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశం దినకరన్ నివాసంలోనే జరిగింది.

చిత్రం..గవర్నర్‌ను కలిసి వెలుపలకు వస్తున్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు