జాతీయ వార్తలు

పైరసీలు, కాపీరైట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశంలో ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చటానికి, మనీ లాండరింగ్ వంటి వ్యవహారాలకు పైరసీ, కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కూడా ప్రధాన వనరులుగా మారుతున్నాయని కేంద్రమ హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దేశంలో అన్ని పోలీసు శిక్షణా కళాశాలల్లో మేధో సంపన్న హక్కుల (ఐపిఆర్)కు సంబంధించి ప్రత్యేక కోర్సును మంగళవారం ప్రకటించిన సందర్భంగా రాజ్‌నాథ్ ప్రసంగించారు. ఐపిఆర్, పైరసీ చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఐపిఆర్ అమలుకు సంబంధించి జాతీయ వర్క్‌షాప్ కూడా ఇక్కడ జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ రెండు చట్టాల ఉల్లంఘనను తేలిగ్గా తీసుకోరాదని, ఇవి ప్రజల సురక్ష, భద్రతలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్న అంశాలని ఆయన పేర్కొన్నారు. నేరగాళ్లు, ఉగ్రవాదులు అక్రమ నిధులను సమకూర్చుకునే మార్గాలుగా ఇవి ఉపయోగపడుతున్నాయని ఆయన హెచ్చరించారు. కేంద్ర వాణిజ్యశాఖ ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసింది. మూడురోజులపాటు జరిగే ఈ వర్క్‌షాప్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఐపిఆర్ చట్టంలో ఏర్పాటు చేసిన నిబంధనల గురించి రాజ్‌నాథ్ వివరించారు. ‘ఈ చట్టం గురించి పోలీసు అధికారులు పూర్తి అవగాహనతో ఉండాలి. ఇందుకోసం ఒక ప్రత్యేక కోర్సును అన్ని శిక్షణ కళాశాలల్లో ప్రవేశపెడుతున్నాం. తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం’ అని ఆయన ప్రకటించారు. ఫార్మా, సాఫ్ట్‌వేర్ వంటి రంగాలు కూడా తీవ్రమైన భద్రతాపర ముప్పును ఎదుర్కొంటున్నాయని రాజ్‌నాథ్ తెలిపారు. ‘ప్రైవేట్ హక్కులతోపాటు పైరసీ కార్యకలాపాలు తీవ్రమైన వ్యవస్థాగత నేరాలకు కారణమవుతున్నాయి. నేరగాళ్లు, టెర్రరిస్టులు అక్రమ సంపాదనకు వీటిని ఉపకరణాలుగా వాడుకుంటున్నారు’ అని ఆయన అన్నారు. దేశంలో శాంతిభద్రతల పరిస్థితిని చక్కబెట్టడానికి పోలీసు బలగాలను వేగంగా ఆధునీకరిస్తున్నామని ఆయన అన్నారు.