జాతీయ వార్తలు

ప్రాథమిక హక్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24:వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీం కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఈ అంశంపై సుదీర్ఘ విచారణ జరిపిన తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ‘్భరత రాజ్యాంగంలోని 21వ అధికరణ పరిధిలోని జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కులో వ్యక్తిగత గోప్యతా హక్కు అంతర్భాగం’అని నిగ్గుదేల్చింది. ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ సారథ్యంలో న్యాయమూర్తులు చలమేశ్వర్, ఎస్‌ఎ బోద్బే,ఆర్‌కె అగర్వాల్,ఆర్‌ఎఫ్ నారిమన్, ఎఎమ్ సప్రే,డివై చంద్రచూడ్,ఎస్‌కె కౌల్, ఎస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం అనేక కోణాల్లో ఈ అంశాన్ని విశే్లషించిన మీదట ఈ చారిత్రక తీర్పును గురువారం వెలువరించింది. వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆథార్‌ను తప్పని సరిచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం బెంచి విచారించింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదన్న కేంద్ర వాదనను పిటిషనర్లు సవాలు చేశారు. ఆధార్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి పౌరులు ఇచ్చే వ్యక్తిగత వివరాలు వాణిజ్య పరంగా ఇతరత్రా వినియోగమవుతున్నాయని, ఇది ప్రజల గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని తమ పిటిషన్లలో స్పష్టం చేశారు. అయితే గోప్యతా హక్కుకు సంబంధించిన అంశాన్ని మాత్రమే తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం లోతైన రీతిలో పరిశీలించి తాజా రూలింగ్ ఇచ్చింది. ఆధార్ వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా లేదా అన్న అంశాన్ని తేల్చే బాధ్యతను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికే వదిలేసింది. ఇప్పటికే దీనిపై ఈ బెంచి విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా, వ్యక్తిగత గోప్యతా హక్కు ప్రాథమిక హక్కేనన్న విషయంలో తొమ్మిది మంది న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పునే వెలువరించారు. అలాగే వ్యక్తిగత గోప్యత హక్కుకు రాజ్యాంగ రక్షణ లేదంటూ 1950లో ఎమ్‌పి శర్మ, 1960లో ఖరక్ సింగ్ కేసుల విషయంలో వెలువడిన తీర్పుల్ని కొట్టివేశారు. ఈ రెండు కేసుల విషయంలో అప్పటి న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల వల్ల చట్టంలోని అంశాలకు సంబంధించి స్పష్టత వచ్చిందని తాజా రూలింగ్‌లో సుప్రీం బెంచి పేర్కొంది. తీర్పును ఇచ్చే ముందు మాట్లాడిన చీఫ్ జస్టిస్ ఖేహర్ ‘తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు భిన్నమైన ఉత్తర్వులు జారీ చేశారు’అని తెలిపారు. అనంతరం ఈ చారిత్రక తీర్పులోని కీలక భాగాలను ఖేహర్ చదివి వినిపించారు.
మూడు వారాల వ్యవధిలో ఆరు రోజుల పాటు ప్రైవసీ అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఇది ప్రాథమిక హక్కేనని కొందరు, కాదని మరి కొందరు చాలా బలంగానే తమ వాదనలు వినిపించారు. ఆధార్‌ను ప్రభుత్వ పథకాల ప్రయోజనాలతో ముడిపెట్టడం పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగకరమని వాదించారు.