జాతీయ వార్తలు

నేడే మార్కెట్లోకి 200 నోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 24: వినాయక చవితి (శుక్రవారం)నుంచి కొత్తగా 200 రూపాయల నోటును మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గురువారం ప్రకటించింది. కొత్త 200 రూపాయల నోటు జారీకి ప్రభుత్వం ఆర్‌బిఐకి అనుమతి ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ఒక రోజ తర్వాత ఈ నోటు మార్కెట్లోకి వస్తూ ఉండడం గమనార్హం. ఆర్‌బిఐ 200 రూపాయల నోటును విడుదల చేయడం ఇదే మొదటిసారి. ‘మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం కలిగిన 200 రూపాయల నోటును, ఈ నెల 25నుంచి ఎంపిక చేసిన ఆర్‌బిఐ కార్యాలయాలు, కొన్ని బ్యాంకుల్లో విడుదల చేస్తుంది’ అని ఆర్‌బిఐ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. పసుపు రంగులో ఉండే ఈ నోటు వెనుక భాగంలో భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా సాంచీ స్థూపం బొమ్మ, స్వచ్ఛ భారత్ లోగో ఉంటాయి. గత ఏడాది నవంబర్ 9న మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఆర్‌బిఐ విడుదల చేసిన కొత్త నోట్లలో ఇది మూడవది. ఇంతకు ముందు ఆర్‌బిఐ 2 వేలు, 500 రూపాయల నోట్లను విడుదల చేయడం తెలిసిందే. అయితే నోట్ల రద్దు తర్వాత ఎదురవుతున్న చిల్లర సమస్యకు సైతం ఇది కొంతమేరకు పరిష్కరిస్తుందని ఆర్‌బిఐ భావిస్తోంది. అంతేకాకుండా కొత్త 50 రూపాయల నోటును కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్‌బిఐ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.