జాతీయ వార్తలు

హర్షణీయం..కానీ పరిమితులు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన చారిత్రక తీర్పును కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. అయితే ఇందుకు సంబంధించి సహేతుకమైన పరిమితులు ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ప్రైవసీ అంశంపై తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏర్పాటు కావడానికి ముందే ‘ప్రైవసీ ప్రాథమిక హక్కు’అని నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లోనే స్పష్టం చేసిందని కేంద్ర న్యాయశాఖ, ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మొదటి నుంచి తాము ఇదే వాదనను వినిపిస్తూనే వచ్చామని ముఖ్యంగా ఆధార్‌కు సంబంధించి ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పామన్నారు. ప్రైవసీ హక్కు ప్రాథమిక హక్కేనని పేర్కొన్న తాము ఇందుకు సహేతుక పరిమితులు ఉండాల్సిన అవసరం ఉందని మాత్రమే చెప్పామన్నారు. సుప్రీం తీర్పు వెలువడిన అనంతరం ప్రభుత్వ స్పందన తెలిపేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు. భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కేనని పేర్కొన్న ఆయన ‘ఎవరూ కూడా బట్టలు లేకుండా రాష్టప్రతి భవన్ నుంచి నిరసన వ్యక్తం చేయలేరు కదా..’అని అన్నారు. అలాగే వాక్‌స్వాతంత్రానికీ పరిమితులు ఉన్నాయమని, ఇది పరువు నష్టం చట్ట పరిమితుల్ని దాటజాలదని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఆధార్‌ను సంక్షేమ పథకాలపై ముడిపెట్టడాన్ని గురించి మాట్లాడిన ఆయన ‘పౌరుల వ్యక్తిగత వివరాలు స్వల్ప పరిమాణంలో మాత్రమే ఇతర సంస్థలకు అందుబాటులో ఉన్నాయి. బయో మెట్రిక్స్ సహా ఇతర వివరాలకు సురక్షితం’అని ఉద్ఘాటించారు.