జాతీయ వార్తలు

సుపరిపాలనతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రజల సంక్షేమం, సంతృప్తి సాధించేందుకు అభివృద్ధి, సుపరిపాలన ఎంతో ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అధికారులు మంచి ఉద్దేశ్యంతో తీసుకునే నిజాయితీ నిర్ణయాలను ప్రభుత్వం సమర్థిస్తుందని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల 70 మంది అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దేశంలోని బాగా వెనుకబడి ఉన్న వంద జిల్లాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని నరేంద్ర మోదీ అధికారలకు సూచించారు. సుపరిపాలన అధికారుల ప్రాధాన్యం కావాలని నరేంద్ర మోదీ సూచించారు. దేశంలో సుపరిపాలన ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది, అభివృద్ధి సాధిస్తేనే ప్రజలు సంతృప్తి చెందుతారని ఆయన చెప్పారు. మంచి ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాలు సామరస్యం, ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పని చేయాలని నరేంద్ర మోదీ తెలిపారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో అధికారులు సమాజంలోని బీద ప్రజలు, సగటు పౌరులను దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచం సహేతుక దృష్టితో భారత దేశం వైపు చూస్తోంది, ప్రపంచంలో సమతూకం కొనసాగేందుకు విజయవంతమైన భారత దేశం ఎంతో అవసరమని మొత్తం ప్రపంచం భావిస్తోందని నరేంద్ర మోదీ చెప్పారు. భారత దేశం సగటు పౌరుడు కూడా అంతర్లీనంగా సమర్థతను కోరుకుంటున్నారని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. పరిమిత వనరులతో కూడిన సామాన్య కుటుంబాలకు చెందిన యువకులు పోటీ పరీక్షలు, క్రీడల్లో మంచి ఫలితాలను సాధిస్తున్నారు, తనంత తాను పెరుగుతున్న ఈ ప్రతిభను పెంచేందుకు కృషి చేయాలి, ప్రోత్సహించాలని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. దేశాభివృద్ధి కోసం అధికారులు తమ వంతు కృషి చేయాలి, దేశం కోసం కష్టపడి పని చేయాలని ఆయన హితవు చెప్పారు. నిర్ణయాలను వేగంగా, సమర్థంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. నరేంద్ర మోదీ కార్యదర్శులతో జరిపిన సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జేట్లి, క్యాబినెట్ కార్యదర్శి పికె సిన్హా, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా హాజరయ్యారు. నరేంద్రమోదీ అధికారులతో జరుపనున్న ఐదు సమావేశాల్లో ఇది మొదటి సమావేశం.