జాతీయ వార్తలు

ఆ 19 మందిపై అనర్హత వేటు వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 24: తమిళనాట అధికార అన్నాడిఎంకెలో సంక్షోభం రోజులో మలుపు తిరుగుతోంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనం నచ్చని శశికళ బంధువు దినకరన్ వర్గం ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని ఓ పక్క డిమాండ్ చేస్తుండగా ఆ 19 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు ప్రభుత్వం పావులుకదుపుతోంది. ప్రభుత్వం చీఫ్ విప్ ఎస్ రాజేంద్రన్ గురువారం ఈ మేరకు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసిన 19 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని ఆయన కోరారు. పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ప్రకటించారని చీఫ్‌విప్ గుర్తుచేశారు. ఫిబ్రవరి 14న పళనిస్వామిని అన్నాడిఎంకె పార్టీ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకున్నారని దాని ఆధారంగానే ఆయన సిఎం అయ్యారని రాజేంద్రన్ స్పష్టం చేశారు. అన్నాడిఎంకె మెజారిటీ ఎమ్మెల్యే మద్దతుతోనే పళని ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. ‘తాజాగా ఆ 19 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడం లేదని చెప్పడం పార్టీ వ్యతిరేకత కిందకే వస్తుంది. అంతేకాదు వారి చర్య రాజ్యాంగంలోని టెన్త్ షెడ్యూల్‌కు వ్యతిరేకం. పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని 19 ఎమ్మెల్యేలు కోల్పోయినట్టే’ అని చీఫ్‌విప్ చెప్పారు. కాబట్టి దినకరన్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ధనపాల్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.