జాతీయ వార్తలు

8మంది జవాన్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 26: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ఓ పోలీస్ క్యాంప్‌పై శనివారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అనూహ్యమైన ఈ దాడిలో నలుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్లతో సహా మొత్తం 8మంది భద్రతా సిబ్బంది మరణించారు. భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. రాజధాని శ్రీనగర్‌కు 25కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్వామా జిల్లా పోలీస్ క్యాంపుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కాంప్లెక్స్‌కు ఉన్న మూడు బ్లాక్‌ల నుంచి ఒకేసారి పెద్ద ఎత్తున కాల్పులు జరుపుకుంటూ చొరపడ్డారు. సిఆర్‌పిఎఫ్, ఇతర ఆర్మీ బలగాలు వెంటనే స్పందించి వారిని దీటుగా ఎదుర్కొన్నారు. దాదాపు నాలుగు గంటలకు పైగా భీకరమైన కాల్పులు జరిగాయి. ‘మరణించిన వారిలో నలుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్లున్నారు. ఒకరు జమ్ము కాశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ కాగా మరో ముగ్గురు ప్రత్యేక పోలీస్ అధికారులు ఉన్నారు. భద్రతాబలగాల ఎదురు కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయారు. ముందుగా రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో మరో టెర్రరిస్టు శవం లభించింది. ముందుగా ఒక భవనం నుంచి ఒక టెర్రరిస్టు పెద్ద ఎత్తున కాల్పులు జరుపుకుంటూ కాంప్లెక్స్ వైపు దూసుకువచ్చాడని, అతణ్ణి వెంటనే మన బలగాలు మట్టుపెట్టాయని, ఆ తరువాత మరో వైపు నుంచి ఉగ్రమూకలు లోపలికి చొరబడ్డాయని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఘటనాస్థలంలో ఒక పేలని ఐఈడి బాంబు దొరికింది. ఉగ్రవాదులంతా విదేశీయులే.’’ అని జమ్ముకాశ్మీర్ డిజిపి ఎస్‌పి వైద్ తెలిపారు. ఈ ఉగ్రదాడిలో తాము భారీ ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి రావటం చాలా బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసులు, జవాన్లు సాహసోపేతంగా పోరాడారని, రాష్ట్రంలో ఉగ్రవాదం అంతానికి వారు చేసిన త్యాగం మరచిపోలేమని వైద్ అన్నారు. పోలీస్ కాంప్లెక్స్‌లో భద్రతావైఫల్యమే ఉగ్రదాడికి కారణమన్న ఆరోపణలను వైద్ ఖండించారు.
ముగ్గురు పాక్ రేంజర్ల హతం
తెలుగు ప్రాంతానికి చెందిన జవాన్‌కు గాయాలు
జమ్ము: ఓ వైపు కాశ్మీర్ లోయలో ఉగ్రదాడులకు తెగబడుతూనే మరోవైపు జమ్ము సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం వాస్తవాధీన రేఖ వద్ద పెద్ద ఎత్తున ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులకు తెగబడింది. భారత బలగాలు తిరిగి జరిపిన కాల్పుల్లో ముగ్గురు పాకిస్తాన్ రేంజర్లు హతమయ్యారు. శనివారం మధ్యాహ్నం పర్గ్వాల్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని, భారత్ గట్టిగా సమాధానం చెప్పిందని అన్నారు. జమ్ములోనే శుక్రవారం పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతాదళానికి చెందిన తెలుగు వాడైన జవాను కెకె అప్పారావు తీవ్రంగా గాయపడ్డాడని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.