జాతీయ వార్తలు

విదేశాలకు రాహుల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయాల కంటే విదేశీ పర్యటనల పట్ల ఎక్కువ మక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ‘బిజెపి బగావో-దేశ్‌కు బచావో’ (బిజెపిని పారదోలండి, దేశాన్ని రక్షించండి) అనే నినాదంతో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తుంటే, వీటికి హాజరుకాకుండా నార్వే ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఓస్లో వెళ్లిపోయారు. ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టటంతోపాటు గుజరాత్‌లో విజయావకాశాలను మెరుగుపరచుకునేందుకు ప్రతిపక్షాలు నానా అగచాట్లు పడుతుంటే, రాహుల్ గాంధీ వీటికి దూరంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. బిహార్‌లో దొడ్డిదారిన ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న బిజెపితోపాటు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అవకాశవాద రాజకీయాల గురించి ప్రజలకు వివరించేందుకు ఆర్‌జెడి అధినాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం పాట్నాలో ప్రతిపక్షాల సంయుక్త ర్యాలీని ఏర్పాటు చేశారు. ప్రతిపక్షానికి చెందిన ప్రతి నాయకుడూ ఈ ర్యాలీకి హాజరవుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఈ ర్యాలీకి వెళ్లే అవకాశాలున్నాయి. సోనియా ఆరోగ్యం ఏమాత్రం అనుకూలించినా ఆమె లాలూ ర్యాలీకి వెళతారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. సోనియా గాంధీ వెళ్లని పక్షంలో పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఈ ర్యాలీకి హాజరవుతారు. సోనియా గాంధీ రాజకీయ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు అహమద్ పటేల్ పాట్నా ర్యాలీకి వెళతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీకి రాజకీయం తెలియదు, అందుకే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారని పార్టీ అంతర్గతంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌లో ప్రతిపక్షాన్ని పటిష్టం చేసేందుకు సెప్టెంబర్ ఒకటిన విపక్షాలు మెగా ర్యాలీని ఏర్పాటు చేశాయి. ఈ ర్యాలీకి కూడా అన్ని పార్టీల నాయకులు హాజరవుతున్నారు. అయితే రాహుల్ గాంధీ ర్యాలీకి కూడా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టటంతోపాటు ప్రతిపక్ష రాజకీయాల్లో కీలకపాత్ర నిర్వహించాలనుకుంటున్న రాహుల్ గాంధీ ఇలా విదేశీ పర్యటనలకు వెళ్లటం ఏమిటని పలువురు ప్రతిపక్ష నాయకులు సైతం ప్రశ్నిస్తున్నారు. రాహుల్ విదేశీ పర్యటనల మూలంగా కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షం ప్రతిష్టకు కూడా దెబ్బతగులుతోందని వారు వాపోతున్నారు.