జాతీయ వార్తలు

బిహార్‌కు 500కోట్ల వరద సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్నియా, ఆగస్టు 26: బిహార్‌లో వరద పీడిత ప్రాంతాల్లో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ తక్షణ సహాయం కింద 500 కోట్ల రూపాయల సహాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపనున్నట్టు మోదీ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వేకు సంబంధించిన వివరాలు పిఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రైతులకు బీమా సొమ్ములు సాధ్యమైనంత త్వరగా అందజేయాలని సంబంధిత కంపెనీలను మోదీ ఆదేశించారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ, సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వరద నష్టంపై ప్రధాని ఆరా తీశారు. ఛూనాపూర్ ఎయిర్‌పోర్టులో సమీక్ష తరువాత ప్రధాని ఢిల్లీ పయనమయ్యారు. ‘వరద పరిస్థితి సమీక్షించి ప్రధాని రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు’ అని పిఎంవో ఆ ప్రకటనలో పేర్కొంది. వరదలకు దెబ్బతిన్న పూర్నియా, కతియార్, కిషన్‌గంజ్, అరారియా జిల్లాలో మోదీ ఏరియల్ సర్వే జరిపారని వారన్నారు. ఆయ వెంట ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నారని పిఎవో స్పష్టం చేసింది. 19 జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించదని, 13 జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని ప్రధానికి వివరించారు. పంట నష్టం తీవ్రంగానే ఉందని అన్నారు. వరద ఉద్ధృతికి ఏటిగట్లకు గండ్లు పడ్డాయని, నీటి పారుదల శాఖకు 27వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. బిహార్‌లో దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికపై మరమ్మతులు చేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖను ప్రధాని మోదీ ఆదేశించారు. వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షలు, గాయపడ్డవారికి 50వేలు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అందిస్తారు. కాగా రాష్ట్రంలో వరదలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు మోదీ వెల్లడించారు. దీనికి సంబంధించి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాతో చర్చించామన్నారు. సప్తకోశ్ డ్యామ్, సుంకోశ్-కం-డైవర్షన్ పథకాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని, వాటికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని నేపాల్ ప్రధానిని కోరినట్టు పిఎంవో తెలిపింది. దీనివల్ల ఇరుదేశాల్లోనూ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో వరదను నివారించవచ్చని మోదీ స్పష్టం చేశారు. తాజా నివేదికల ప్రకారం వరదలకు ఇప్పటివరకూ 418 మంది చనిపోయారు. 19 జిల్లాల్లో కోటీ 67 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆస్తి, పంట నష్టం అపారంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. జెడియు-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని బిహార్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మహాకూటమి నుంచి బయటకు వచ్చి బిజెపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

చిత్రం..వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం బిహార్ ఉన్నతాధికారులు,
ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ