జాతీయ వార్తలు

నల్లగొండలో గుర్మీత్ ఆస్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ/చిట్యాల, ఆగస్టు 26: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన డేరా సచ్చా సౌదా సంస్థ చీఫ్ గుర్మీత్ రామ్హ్రీమ్‌సింగ్ అలియాస్ డేరా బాబాకు నల్లగొండ జిల్లాలో సైతం ఆస్తులున్నాయ. ఆశ్రమ స్థాపన పేరుతో పదేళ్ల క్రితం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడులో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని భూముల కొనుగోలు చేపట్టారు. 55 ఎకరాల భూములు రైతుల నుండి కొనుగోలు చేశారు. ఈ 55 ఎకరాల భూముల చుట్టూ ప్రహరీ నిర్మించారు. హైదరాబాద్‌కు చెందిన శ్యాంలాల్ ఈ ఆశ్రమ వ్యవహారాలు, భూముల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.
ఈ భూముల్లో అసైన్డ్ భూములుండడంతో ప్రహరీ గోడ కూల్చకుండా ఈ ఏడాది మార్చి 7న హైకోర్టు ద్వారా స్టే పొందారు. వీటి రెగ్యులైజేషన్ కోసం గత ఏప్రిల్ 18న చిట్యాల తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. అనంతరం గత మే 9వ తేదీన జిల్లా జాయింట్ కలెక్టర్‌కు, సిసిఎల్‌ఏ విభాగానికి, జూన్ 30న నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు అసైన్డ్ భూముల రెగ్యులైజేషన్ కోసం దరఖాస్తులు చేశారు. డేరా సచ్చా సౌదా ట్రస్టు సభ్యులు వెల్మినేడు గ్రామంలో ఆశ్రమ నిర్మాణం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గ్రామంలోని రామాలయానికి లక్ష విరాళం, పాఠశాలలో సైకిల్ స్టాండ్, వివేకానంద విగ్రహం ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలకు డేరా సంస్థ ఆర్థిక సహకారం అందించడం విశేషం. డేరా సచ్చా సౌదా సంస్థ వెల్మినేడు ఆశ్రమ పరిధిలో పేద విద్యార్థులకు పాఠశాల, కళాశాల, హాస్టళ్లు, వృద్ధాశ్రమం, ఆసుపత్రి నిర్మించతలపెట్టిందని ఆశ్రమ పర్యవేక్షకుడు శ్యాంలాల్ తెలిపారు. ఆసైన్డ్ భూముల కొనుగోలు తెలిసి చేసింది కాదని రిజిస్ట్రేషన్ సందర్భంగానే తమకు సదరు భూములు ఆసైన్డ్ భూములని తెలిసిందన్నారు.
భూములు స్వాధీనం చేసుకోవాలి
డేరా బాబా సంస్థకు చెందిన వెల్మినేడులోని భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని లేదా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు, ప్రజాపయోగ అవసరాలకు ఉపయోగించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ భూముల వివాదంపై శనివారం చిట్యాల తహశీల్దార్ విశాలక్ష్మి క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించారు. భూరికార్డులను పరిశీలించి వీటిలో తొమ్మిది ఎకరాల అసైన్డ్ భూములున్నట్లు తెలిపారు.

చిత్రం..వెల్మినేడులో డేరా సచ్చా పేరిట ఏర్పాటు చేసిన బోర్డులు