జాతీయ వార్తలు

డేరా సచ్చా బాబా దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచకుల, ఆగస్టు 26: ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో హర్యానాలోని వివాదాస్పద డేరా సచ్చా సౌదా ఆశ్రమం అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషిగా ప్రకటించింది. కాగా, ఆయనకు విధించే శిక్షను సోమవారం (28న) ప్రకటిస్తామని జడ్జి తెలిపారు. ఇద్దరు మహిళా భక్తులపై రామ్ రహీమ్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ అజ్ఞాత వ్యక్తి 2002లో రాసిన లేఖను ఫిర్యాదుగా స్వీకరించిన పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా సిబిఐని ఆదేశించింది. కేసు నమోదు చేసిన సిబిఐ విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం పంచకులలోని సిబిఐ ప్రత్యేక జడ్జి జగ్‌దీప్ సింగ్ రామ్ రహీమ్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పారు. ఈ నెల 28న శిక్షను ప్రకటిస్తారు. ఈ కేసులో రామ్ రహీమ్‌కు ఏడేళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడే అవకాశం ఉంది. అయితే 14 ఏళ్ల దాకా శిక్షను పొడిగించే అవకాశం కూడా లేక పోలేదు. అంతకు ముందు రామ్ రహీమ్ డేరా సచ్చా సౌదా ఆశ్రమం ప్రధాన కార్యాలయం ఉన్న సిర్సానుంచి చండీగఢ్ శివార్లలోని పంచకుల వరకు 260 కిలోమీటర్ల మేర దాదాపు వందకు పైగా వాహనాల మందీ మార్బలంతో ఊరేగింపుగా రావడం సైతం తీవ్ర విమర్శలకు గురయింది. శుక్రవారం కోర్టు తీర్పు ప్రకటించనున్న నేపథ్యంలో పంచకులలో రెండు రోజుల ముందే నిషేధాజ్ఞలు విధించినప్పటికీ వేల సంఖ్యలో రామ్ రహీమ్ సింగ్ అనుయాయులు కోర్టు వద్దకు చేరుకున్నారు. జడ్జి తీర్పు ప్రకటించిన వెంటనే కోర్టు బయట వేచి ఉన్న ఆయన అనుయాయులు ఒక్కసారిగా రెచ్చిపోయి హింసాకాండకు దిగడంతో రామ్ రహీమ్‌ను పోలీసులు హెలికాప్టర్‌లో రోహ్టక్ జైలుకు తరలించాల్సి వచ్చింది.

చిత్రం..పంచకులలో శుక్రవారం వీధుల్లోకి చేరి ఆందోళనకు దిగిన డేరా సచ్చా అనుయాయులు