జాతీయ వార్తలు

నేడు గుర్మీత్‌కు శిక్ష ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 27:అత్యాచార కేసులో దోషిగా నిర్థారించిన డేరా సచ్ఛా సౌదా అధినేత గుర్మీత్ రామ్హ్రీం సింగ్‌కు సోమవారం శిక్ష ఖరారు కానుం ది. ఈ సందర్భంగా ఎలాంటి అలజడులు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ సంస్థకు చెందిన అనేక మంది నాయకుల్ని ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఈ శిక్షను వెలువరించనున్న రోహ్‌తక్ జిల్లా జైలులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సునేరియా జైలు రోహ్‌తక్ పట్టణ శివార్లలో ఉండటం వల్ల గుర్మీత్‌ను జైలుకు తీసుకొచ్చే మార్గం పొడవునా భద్రతా వలయాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. న్యాయమూర్తి తన తీర్పును వెలువరించడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని హర్యానా ప్రభుత్వాన్ని
పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గుర్మీత్‌ను శుక్రవారం కోర్టు దోషిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన్ని సునేరియా జైల్లోనే ఉంచారు. గత రెండు రోజులుగా రోహ్‌తక్‌లో విస్తృత నిఘాను కొనసాగిస్తున్న పోలీసులు, పారామిలటరీ దళాలు అనేక చోట్ల ఆకస్మిక తనీఖీలు చేస్తున్నారు. అన్ని డేరా కేంద్రాలను మూసివేశామని, సమస్యలు సృష్టించేందుకు అవకాశం ఉన్న ఈ సంస్థ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నామని రోహ్‌తక్ ఐజి నవదీప్ విర్క్ తెలిపారు. మొత్తం జిల్లా తమ అదుపులో ఉందని, ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు దళాలు సిద్ధంగా ఉన్నాయని డిప్యూటీ పోలీసు కమిషనర్ అతుల్ కుమార్ తెలిపారు. రోహ్‌తక్‌లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తున్నామని, ఇందుకు సహకరించని లేదా తగిన ఆధారాలు లేని వారిని అదుపులోకి తీసుకుంటున్నామన్నారు. శుక్రవారం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే డేరా అనుచరులు తీవ్రస్థాయిలో అల్లర్లకు పాల్పడటంతో 32మంది మరణించిన నేపథ్యంలో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు.