జాతీయ వార్తలు

ఏకకాల ఎన్నికలే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27:జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏకకాల ఎన్నికలే మేలని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. 2024 నుంచి లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలోనే ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.ప్రచారం వల్ల పాలనకు ఎలాంటి విఘాతం కలుగకుండా నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా ఈ ఎన్నికలు జరగాలని నీతి ఆయోగ్ ఓ అధ్యయన నివేదికలో తెలిపింది. 2024 నుంచే ఏకకాల ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొంటూ దీని వల్ల ఒకేసారి కొన్ని అసెంబ్లీల పదవీకాలం పెంచడం, తగ్గించడం వంటి సమస్య తలెత్తుతుందని తెలిపింది. ఇందుకు వీలుగా కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించాలని, ఇందుకోసం రాజ్యాంగ నిపుణులు, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. ఏకకాల ఎన్నికల కోసం చట్టపరంగా, రాజ్యాంగ పరంగా కూడా అనుగుణమైన సవరణలు చేయాల్సి వస్తుందని తెలిపింది. ‘మూడేళ్ల కార్యాచరణ అజెండా 2017-18 నుంచి 2019-2020’అన్న శీర్షికతో నీతి ఆయోగ్ ఈ నివేదిక అందించింది. ఏకకాల ఎన్నికల నిర్వహణ తతంగాన్ని వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ కీలక భూమిక పోషించాలని సూచించింది. ఏకకాలంలోనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగాలని మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీలు అనేక సందర్భాల్లో గట్టిగా ప్రతిపాదించిన నేపథ్యంలో నీతి ఆయోగ్ సూచనకు మరింత బలం చేకూరినట్టయింది.