జాతీయ వార్తలు

బలపరీక్షకు ఆదేశించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 27: తమిళనాడులోని అధికార అన్నా డిఎంకె ఎమ్మెల్యేల్లో ఒక వర్గం తిరుగుబాటు బావుటా ఎగురవేసినందున శాసనసభలో ముఖ్యమంత్రి కె.పళనిస్వామి మెజార్టీని నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. డిఎంకె నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందం ఆదివారం తమిళనాడు గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావును కలసి ఈ మేరకు పళనిస్వామిని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ భేటీ ముగిసిన అనంతరం డిఎంకె నేతలు మాట్లాడుతూ, ఈ విషయమై గవర్నర్ నిర్ణీత వ్యవధిలోగా చర్యలు చేపట్టకపోతే రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ వద్దకు వెళ్లేందుకు సైతం వెనుకాడేది లేదని, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఎఐఎడిఎంకె డిప్యుటీ చీఫ్ టిటివి.దినకరన్‌కు విధేయులైన 19 మంది ఎమ్మెల్యేలు ఈ నెల 21వ తేదీన విద్యాసాగర్ రావును కలసి ముఖ్యమంత్రి పట్ల తమకు విశ్వాసం లేదని తెలియజేసిన విషయం విదితమే. దీంతో ప్రస్తుత ప్రభుత్వం మెజార్టీని కోల్పోయిందని, కనుక ముఖ్యమంత్రి పళనిస్వామి శాసనసభలో తమ బలాన్ని నిరూపించుకోవాలని డిఎంకె డిమాండ్ చేస్తోంది. మొత్తం 234 మంది సభ్యులు గల తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత ఎఐఎడిఎంకె ప్రభుత్వానికి స్పీకర్‌తో కలిపి 113 మంది శాసనసభ్యుల మద్దతు మాత్రమే ఉందని గవర్నర్‌కు సమర్పించిన తాజా లేఖలో డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకె.స్టాలిన్ పేర్కొన్నారు. ఈ విషయమై ప్రతిపక్షాలు గవర్నర్‌కు వినతిపత్రాన్ని సమర్పించడం గత వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి.