జాతీయ వార్తలు

మోదీ సర్కార్‌లోకి అన్నాడిఎంకె?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: అన్నాడిఎంకె త్వరలోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో చేరుతుందని బిజెపి సీనియర్ నాయకుడొకరు చెప్పారు. ‘అన్నా డిఎంకె తప్పకుండా ఎన్డీఏలో చేరుతుంది. దీనికి సంబంధించి ప్రకటన వెలువడ్డమే తరువాయి. అన్నాడిఎంకె ఎప్పుడైతే ఎన్డీఏలో చేరుతుందో అప్పుడు సహజంగానే ఆ పార్టీ ప్రభుత్వంలో కూడా చేరుతుంది’ అని ఆ నేత చెప్పారు. కాగా, టిటివి దినకరన్ వర్గానికి చెందిన అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు కొంతమంది తిరుగుబాటు చేయడాన్ని బిజెపి నాయకుడు తేలిగ్గా కొట్టివేస్తూ అది కేవలం పార్టీ అంతర్గత వ్యవహారమేనని, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని అన్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలోని అన్నాడిఎంకె వర్గాలు రెండూ ఇటీవల విలీనమైన తర్వాత దినకరన్ మద్దతుదారులయిన కొంతమంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో పార్టీలో కొత్తగా సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు దినకరన్‌కు మద్దతు ఇస్తున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే తన మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. అన్నాడిఎంకెకు లోక్‌సభలో 37 మంది, రాజ్యసభలో 13 మంది ఎంపీలున్నారు.