జాతీయ వార్తలు

డేరా బాబాను తప్పించే యత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 27: ఈ నెల 25న సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుకావడం కోసం డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పంచకుల వచ్చినప్పుడు ఆయన భద్రతా వలయంలోని ఏడుగురు భద్రతా సిబ్బందిపై దేశద్రోహం, హత్యాయత్నం ఆరోపణల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో హర్యానా పోలీసుకు చెందిన అయిదుగురు పోలీసులు కూడా ఉన్నారు. ‘అయిదుగురు హర్యానా పోలీసు సిబ్బందిసహా ఏడుగురిపై దేశద్రోహం అభియోగాలు నమోదు చేశాం’ అని పంచకుల పోలీసు (సెక్టార్-5) ఇన్‌స్పెక్టర్ కరంబీర్ సింగ్ ఆదివారం ఇక్కడ చెప్పారు. వారిపై హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.
అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా బాబాను శుక్రవారం సిబిఐ కోర్టు దోషిగా ప్రకటించిన తర్వాత పంచకుల కోర్టు కాంప్లెక్స్‌నుంచి బైటికి తీసుకువస్తున్నప్పుడు ఆయన భద్రతా సిబ్బందిలోని ఈ ఏడుగురు ఆయనను తప్పించడానికి ప్రయత్నించారని పోలీసులు చెప్పారు. డేరా బాబాను రోహ్టక్ జైలుకు హెలికాప్టర్‌లో తీసుకెళ్లేందుకు వెస్ట్రన్ కమాండ్‌కు తీసుకెళ్తున్నప్పుడు ఈ భద్రతా సిబ్బంది బాబాను జైలుకు తీసుకెళ్లనివ్వమంటూ హర్యానా పోలీసులతో గొడవపడినట్లు వారు చెప్పారు. అయితే హర్యానా పోలీసులు వారిని ఒడిసి పట్టుకొని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన ఏడుగురు పోలీసులను శనివారం కోర్టు ఎదుట హాజరుపర్చగా కోర్టు వారిని ఏడు రోజుల పోలీసు రిమాండ్‌కు పంపించినట్లు సింగ్ చెప్పారు. అరెస్టు చేసిన హర్యానా పోలీసుల్లో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ ర్యాంక్ వాళ్లని ఆయన చెప్పారు.
డేరా బాబా కాన్వాయ్‌లోని అనేక వాహనాలను శుక్రవారం జప్తు చేయడం జరిగిందని, వాటిలో ఒక ఫైరింజన్ కూడా ఉందని ఆదివారం పంచకుల డిసిపిగా బాధ్యతలు స్వీకరించిన మన్‌బీర్ సింగ్ చెప్పారు. డేరాకు చెందిన ఫైరింజన్‌లో రెండు భారీ ట్యాంక్‌లున్నాయని, వాటిలోనుంచి దుర్వాసన వస్తోందని, ట్యాంకుల్లోంచి స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను పరీక్షలకోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని ఆయన చెప్పారు.