జాతీయ వార్తలు

స్వచ్ఛతే ఇక సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: స్వచ్ఛతే సేవ అన్న సరికొత్త ఉద్యమాన్ని చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్‌లో మాట్లాడిన మోదీ, దేశంలో 67శాతం మంది జనాభాకు ఇప్పుడు మరుగుదొడ్లు ఉన్నాయని, అలాగే 2 లక్షల 30వేల గ్రామాలు మరుగుదొడ్ల సమస్యకు దూరమయ్యాయని స్పష్టం చేశారు. రానున్న గాంధీ జయంతిని పురస్కరించుకుని పరిశుభ్రతే సేవ అన్న ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆ విధంగా పారిశుద్ధ్య వాతావరణాన్ని పాదుగొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. స్వచ్ఛ భారత్ మూడవ వార్షికోత్సవాన్ని ప్రస్తావించిన ఆయన అక్టోబర్ 2తో ఇది పూర్తవుతుందని గుర్తుచేశారు. ఈ మూడేళ్లలో ఎన్నో సానుకూల ఫలితాలు ప్రస్ఫుటమవుతూ వచ్చాయని, ముఖ్యంగా మరుగుదొడ్లు 39 శాతం నుంచి 67 శాతం జనాభాకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రానున్న గాంధీ జయంతిని స్వచ్ఛతే సేవ అన్న భావనతో జరుపుకోవాలన్నారు. సెప్టెంబర్ 15నుంచి స్వచ్ఛతే సేవ అన్న సరికొత్త ఉద్యమానికి నాంది పలకాలని పిలుపునిచ్చిన మోదీ ‘స్వచ్ఛత దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం. మీ ప్రతి ప్రయత్నాన్ని ఇందులో భాగం చెయ్యండి. గాంధీ జయంతి ఎంతగా మెరిసిపోతుందో మీరే చూస్తారు..’ అని అన్నారు. జలసేవే దేవుని సేవ అన్న భావనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. దీపావళి, దసరా వంటి పర్వదినాల సందర్భాలను ఉపయోగించుకుని స్వచ్ఛతే సేవ అనే భావానికి బలాన్నివాలన్నారు. ఇందులో ఎన్జీవోలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, కలెక్టర్లు, సర్పంచ్‌లు, సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందినవారు, రాజకీయ నాయకులు కూడా ఇందులో క్రియాశీలకంగా పాల్గొనాలన్నారు. సెప్టెంబర్ 15 నుంచి గాంధీ జయంతి వరకు పక్షం రోజులపాటు వీరంతా స్వచ్ఛతే సేవ ఉద్యమంలో పాల్గొని మహాత్ముడి కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో సామాజక మీడియా ముందుకు రావాలని, పిల్లలకు ఈ విషయంలో పోటీలు నిర్వహించాలని మోదీ పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో ముగ్గురికి, రాష్ట్ర స్థాయిలో ముగ్గురికి బహుమతులు ఇవ్వాలన్నారు. ఇందుకోసం భాషాపరమైన వ్యాసాల పోటీతోపాటు సినిమా పోటీలను, పెయింటింగ్ పోటీలను కూడా నిర్వహించాలన్నాను.

ప్రజలకు బీమా ధీమా
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 కోట్ల కుటుంబాలకు జన్‌ధన్ ఖాతాలు లభించాయని, ఇందులో 65వేల కోట్ల రూపాయల మొత్తం డిపాజిట్ అయిందని మోదీ తెలిపారు. జన్‌ధన్ యోజన వల్ల సామాన్య ప్రజలకు ఏ మేరకు మేలు జరిగిందన్నదానిపై బ్యాంకులు సర్వే నిర్వహించాయని అన్నారు. దీనితోపాటు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన వంటి బీమా పథకాల వల్ల కూడా ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ సర్వే లన్నింటిలోనూ ఎన్నో స్ఫూర్తిదాయక విజయాలు సాకారమైనట్లు స్పష్టమవుతోందన్నారు. కేవలం రూపాయి లేదా 30 రూపాయలతో మొదలయ్యే ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన బీమా యోజన పేదలకు సరికొత్త ధీమాను అందిస్తున్నాయన్నారు. సోమవారంతో ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన మూడేళ్లు పూర్తిచేసుకుంటుందని మోదీ తెలిపారు.

సమైక్యతకు నిదర్శనం
దేశ ఐక్యత, సమైక్యతకు సంబంధించి జమాయత్ ఉలేమా ఎ హింద్ వంటి ముస్లిం సంస్థలు నిరుపమాన సేవలు అందిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల గుజరాత్‌లోవరద ముంపునకు గురైన 22 ఆలయాలు, రెండు మసీదులను ఈ సంస్థలు శుభ్రం చేశాయని, ఆ విధంగా మత సామరస్యానికి త్రీకగా నిలిచాయని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి, వైవిధ్యభరితమైన జీవన విధానానికి భారత్ పెట్టింది పేరు అని పేర్కొన్న మోదీ, ఈ వైవిధ్యం అన్నది ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వస్తధ్రారణకే పరిమితం కాలేదని, జీవితంలోని ప్రతి దశలోనూ ఇది కన్పిస్తోందని గుర్తుచేశారు. భారతదేశానికి అత్యున్నతమైన సాంస్కృతిక వారసత్వం ఉందని వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ వారసత్వం అనేక రూపాల్లో ఈ వైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. మన సాంస్కృతిక సంప్రదాయాలు, సాంఘిక కట్టుబాట్లు, చారిత్రక పరిణామాలపై దృష్టిపెడితే 365 రోజులూ ఏదో ఒక ఉత్సవంతో ముడిపడే ఉంటాయని మోదీ అన్నారు. భారత పర్వదినాలన్నీ కూడా ప్రకృతితో ముడిపడినవేనని చెప్పిన మోదీ, వీటిలో చాలావరకు రైతులు, జాలర్లకు సంబంధించినవేనన్నారు.