జాతీయ వార్తలు

దేశ ప్రగతికోసం సంఘటితం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 27: దేశం పురోగమించడానికి ప్రజలంతా సంఘటితం కావాలని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం అన్నా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. దేశం స్వాతంత్య్రం సాధించి 70 ఏళ్లయినప్పటికీ ఇంకా పేదరికం, నిరక్షరాస్యత, స్ర్తి-పురుష అసమానత్వం, కుల వివక్ష లాంటి సమస్యలు ఉన్నాయని, ఈ రుగ్మతలపై పోరాటం చేసేందుకు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనమంతా ప్రతినబూనాలని అన్నారు. ప్రజాస్వామ్య సమాజంలో హింసకు తావులేదని, దాన్ని అదుపు చేసి తీరాల్సిందేనని అన్నారు. ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనదని, స్ర్తి-పురుష అసమానత్వాన్ని తొలగించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. తమిళనాడు వచ్చిన వెంకయ్యకు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు తమిళ్‌ఇసై సౌందర్ రాజన్ ఘనంగా స్వాగతం పలికారు. వెంకయ్య నాయుడికి గవర్నర్ తిరుక్కురళ్ తెలుగు అనువాదం కాపీని బహూకరించారు.

చిత్రం..అన్నా యూనివర్శిటీలో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడుకు జ్ఞాపికను అందజేస్తున్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్ర మంత్రి అనంత కుమార్