జాతీయ వార్తలు

మంచి రోజులా.. అవెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఆగస్టు 27: కేంద్రంలో బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయినా ‘మంచి రోజుల’ జాడ తెలియడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆదివారం పాట్నాలో జరిగిన విపక్షాల ర్యాలీలో మాట్లాడిన మమత దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముక్కలు చెక్కలు కానివ్వమని ప్రతిజ్ఞ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పరాజయం, లాలూ ప్రసాద్ విజయం తథ్యమంటూ జోస్యం చెప్పారు. ‘గత ఎన్నికల్లో లాలూ పేరు చెప్పి నితీశ్ ఓట్లు దండుకున్నారు.. ఏమి జరిగిందో మీరే చూశారుకదా..’ అని పెద్ద సంఖ్యలో హాజరైన జనాన్ని ఉద్దేశించి అన్నారు. తన చేతిలో ఉన్న దర్యాప్తు ఏజెన్సీలను ఉపయోగించుకుని ప్రత్యర్థుల్ని భయపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోదంటూ ధ్వజమెత్తిన మమత ‘నేను ఎవరికీ బెదిరేది లేదు’ అని ఉద్ఘాటించారు. పెద్దనోట్ల రద్దుకు ముందు చెప్పిందేమీ జరుగలేదని, ఈ నిర్ణయం వల్ల జనం ఎంతో నష్ట పోయారంటూ మమత ధ్వజమెత్తారు. నోట్ల రద్దు అనంతరం ఆర్‌బిఐ వద్ద డిపాజిట్ అయిన మొత్తం ఎంతో ఇప్పటికీ తెలియలేదని అన్నారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంచివాడు కాదని ధ్వజమెత్తిన లాలూ ‘ఎన్‌డిఏ నేతలందరూ నేను సృష్టించిన వారే. నితీశ్ ఎదగడానికి కారణం నేనే. భారంగానే ఆయనతో పొత్తు పెట్టుకున్నాను. ప్రభుత్వాన్ని నిర్వహించే అవకాశం ఇచ్చాను’ అని అన్నారు. నితీశ్‌లాంటి పార్టీలు మారే వ్యక్తిని తానింతవరకూ చూడలేదంటూ లాలూ నిప్పులు చెరిగారు. దేశంలో మత వైషమ్యాలను తరిమికొడతామని ఈ ర్యాలీ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు.
గాంధీ మైదాన్‌లో జరిగిన ఈ భారీ ర్యాలీకి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్, జెడియూ రెబల్ నాయకుడు శరద్ యాదవ్, సమాజ్‌వాది పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సిపిఐ నాయకుడు సుధాకర్‌రెడ్డి, డిఎంకె, జెడిఎస్, ఆర్‌ఎస్‌పిలకు చెందిన విపక్ష నేతలు హాజరయ్యారు. ఈ ర్యాలీకి రావాల్సిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్, బిఎస్‌పి నాయకురాలు మాయావతి హాజరు కాలేదు. రాహుల్ మాత్రం ఓ సందేశం పంపారు. ర్యాలీకి వెళ్లద్దంటూ జెడియూ నాయకత్వం చేసిన హెచ్చరికను బేఖాతరు చేస్తూ శరద్ యాదవ్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అఖిలేశ్ యాదవ్ జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు వల్ల నిరుద్యోగం పెరిగిపోయిందని, అందుకు కేంద్రంలోని అధికార బిజెపి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

చిత్రాలు.. శరద్ యాదవ్, మమతలకు సాదర స్వాగతం పలుకుతున్న లాలూ ప్రసాద్ యాదవ్
*ఆదివారం పాట్నాలో ఆర్జేడీ నిర్వహించిన విపక్షాల ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనం