జాతీయ వార్తలు

నెగ్గిన దౌత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: డోక్లామ్ బలాబలాల పరీక్షలో చైనాపై భారత్ విజయం సాధించింది. డోక్లామ్‌లో రెండు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతను తగ్గించుకునేందుకు రెండు దేశాలు తమ సైన్యాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాయి. ఈ మేరకు సైన్యాల ఉపసంహరణ ప్రారంభమైందని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. అటు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ మాత్రం ఇరుపక్షాల పరస్పర అంగీకారాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. భారత్ తన బలగాలను డోక్లాం నుంచి ఉపసంహరించుకుంటోందని మాత్రమే పేర్కొన్నారు. డోక్లాంలో తమ గస్తీ కొనసాగుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో డోక్లాంలో రహదారి నిర్మాణం కొనసాగింపుపై ఆమె వ్యూహాత్మక వౌనం వహించారు. ‘‘్భరత చైనా దేశాలు ఇటీవల కాలంలో డోక్లామ్ ఘటనలపై దౌత్యపరమైన చర్చలు కొనసాగించాయి, ఈ చర్చల సమయంలో మన అభిప్రాయాలు, ప్రయోజనాలు, భయాందోళనల గురించి చైనాకు తెలియజేశాం, ఈ చర్చల ఆధారంగా డోక్లామ్ నుండి సైన్యాలను ఉపసంహరించుకోవాలనే అంగీకారం కుదిరింది.’అని విదేశీ వ్యవహారాల శాఖ తమ పత్రికా ప్రకటనలో తెలిపింది.
డోక్లామ్‌లో చైనా రోడ్డు నిర్మాణానికి ఇక తెర పడినట్లే. చైనా విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం డోక్లామ్‌లో తమ సైనికుల పహరా కొనసాగుతుందని ప్రకటించటం గమనార్హం. చిన్న చిన్న మార్పులు, సర్దుబాట్లు మాత్రమే జరుగుతాయని పేర్కొంది. రోడ్డు నిర్మాణం కొనసాగింపు గురించి చైనా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 3న చైనాలో జరిగే బ్రిక్స్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళుతున్న సమయంలో భారత, చైనాల మధ్య ఈ అంగీకారం కుదరటం గమనార్హం. డోక్లామ్ సమస్యను పరిష్కరించుకునేందుకు ఉభయ దేశాలు తమ సైన్యాలను ఉపసంహరించుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రకటించటం తెలిసిందే. డోక్లామ్‌లో గత జూన్ నెల నుండి భారత, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనటం తెలిసిందే. భూటాన్ భూభాగంలో చైనా రోడ్డు నిర్మించటాన్ని భారత దేశం ప్రతిఘటించటం తెలిసిందే. భారత్‌కు చెందిన మూడు వందల మంది సైనికులు బుల్‌డోజర్లతో వెళ్లి రోడ్డు నిర్మాణం చేపట్టిన చైనా సైనికులను నిలువరించటం తెలిసిందే. భారత సైనికులు తమ సైనికులను అడ్డుకోవటం పట్ల మండిపడిన చైనా తన ప్రతినిధుల ద్వారా, మీడియా ద్వారా రంకెలు వేయటం తెలిసిందే. సైన్యాన్ని ఉపసంహరించుకోకపోతే యుద్ధం తప్పదని కూడా బెదిరించింది. చైనా సైనికులు పలుమార్లు హిమాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్‌తో ఉన్న సరిహద్దుల్లో మన దేశంలోకి చొచ్చుకు వచ్చి కొంత గొడవ చేశారు. మరోవైపు హిందుమహాసముద్రంలో చైనా తమ జలాంతర్గాములను, యుద్ధ నౌకలను భారత దేశం వైపు పంపించటం ద్వారా బెధిరించేందుకు ప్రయత్నించింది. భారత్‌పై ఒత్తిడి తీసుకురావటం ద్వారా డోక్లామ్ నుండి సైనికులను ఉపసంహరించేలా చేసేందుకు యత్నించింది. భారత్‌కు బుద్ధి చెప్పనున్నట్లు ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలి శాశ్వత సభ్య దేశాలకు చైనా వర్తమానం కూడా పంపించిది. చైనా ఇంత ఎత్తు ఎగిరినా భారత్ తొణకలేదు, బెణక లేదు. డొక్లామ్‌లో చైనా భూటాన్‌కు చెందిన భూమిపై రోడ్డు నిర్మించటం మంచిది కాదని భారత్ వాదించింది. భూటాన్ లాంటి చిన్న దేశాన్ని భయపెట్టటం మంచిది కాదని వాదించింది. చైనా తమ సైనికులను ఉపసంహరించుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేసింది. వివాదానికి సంబంధించిన అంశాలను విదేశీ రాయబారుల ముందు పెట్టింది. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాల రాయబారులకు ఈ అంశాలను వివరించింది. భూటాన్‌ను భయపెట్టటం ద్వారా డోక్లామ్‌ను స్వాధీనం చేసుకునేందుకు చైనా కుట్ర చేస్తోందని భారత్ వాదించింది. ఎట్టకేలకు భారత దేశం దౌత్య నీతి ఫలించింది. భారత, చైనా దేశాలు తమ సైనికులను ఉపసంహరించుకోవటం ద్వారా డోక్లామ్ సమస్యను పరిష్కరించుకుందుకు ప్రయత్నం ప్రారంభించాయి.
దొంగదెబ్బ తీయవచ్చు
డోక్లామ్ విషయంలో భారత దేశం దౌత్యనీతికి దెబ్బ తిన్న చైనా మరో రకంగా భారత దేశాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తుందని విదేశీ వ్యవహారాల విశే్లషకులు హెచ్చరిస్తున్నారు. డోక్లామ్ ఓటమిని చైనా అంత సునాయసంగా మరిచిపోదు, తనకు జరిగిన అవమానానికి ప్రతిగా తనకు అనుకూలంగా ఉండే సమయంలో భారత దేశంపై ఎదురు దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తుందని వారంటున్నారు.