జాతీయ వార్తలు

20 ఏళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోహ్తక్ (హర్యానా), ఆగస్టు 28: రేపిస్ట్ బాబాకు తగిన శిక్షే పడింది. ఇద్దరు మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాసచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌సింగ్‌కు ఇరవై ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జగదీప్ సింగ్ సోమవారం తీర్పు చెప్పారు. గత శుక్రవారం గుర్మీత్‌ను దోషిగా ప్రకటించిన అనంతరం చెలరేగిన హింసాకాండలో 37మంది బలైన నేపథ్యంలో న్యాయమూర్తి తానే గుర్మీత్ ఉన్న సునేరియా జైలుకు వచ్చి అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టురూంలో శిక్షను వెలువరించారు. ఇందుకోసం జస్టిస్ జగదీప్ సింగ్‌ను ప్రత్యేకంగా హెలికాప్టర్‌లో జైలుకు తీసుకువచ్చారు. 2002లో గుర్మీత్‌పై ఇద్దరు మైనర్లను రేప్ చేశారంటూ అభియోగాలు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ గుర్మీత్ దోషిగా తేలారు. ఒక్కో కేసులో పదేళ్లు జైలు శిక్షను అనుభవించాలని, ఒక దాని తరువాత మరొక శిక్షను వరుసగా అనుభవించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించేందుకు వీల్లేదని చెప్పటంతో గుర్మీత్ 20 ఏళ్లు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు ఒక్కో కేసులో 15లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని గుర్మీత్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. వీటిలో ఒక్కో బాధితురాలికి రూ.14లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే గుర్మీత్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, ఆరోగ్యపరంగా కూడా అనేక బాధలు పడుతున్నందున ఆయనను క్షమించాలని డిఫెన్స్ లాయర్, న్యాయమూర్తిని కోరారు. గుర్మీత్ చేసిన సామాజిక సేవను పరిగణలోకి తీసుకుని శిక్షా కాలాన్నైనా తగ్గించాలని అభ్యర్థించారు. గుర్మీత్ సైతం తనను క్షమించాలంటూ రెండు చేతులు జోడించి న్యాయమూర్తి ఎదుట కంట తడిపెట్టుకుని మరీ వేడుకున్నారు. కానీ, జస్టిస్ జగదీప్ సింగ్ మాత్రం వారి కోరికను మన్నించలేదు. గుర్మీత్ చేసిన నేరం క్షమించరానిదని స్పష్టం చేశారు. జైలులో కూడా గుర్మీత్‌ను సాధారణ ఖైదీగానే పరిగణించాలని, మిగతా ఖైదీలతో సమానంగా ఆయన పట్ల వ్యవహరించాలని జైలు అధికారులను ఆదేశించారు. కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని అనంతరం ఆయన మీడియాతో చెప్పారు.
సిర్సాలో ఉద్రిక్తతలు
గుర్మీత్‌కు శిక్ష విధించిన నేపథ్యంలో డేరా ఆశ్రమం ప్రధాన కార్యాలయం ఉన్న సిర్సాలో సాయంత్రం అతని అనుచర గణం రెచ్చిపోయారు. డేరా ఆశ్రమానికి పది కిలోమీటర్ల దూరంలో ఓ కారును తగులబెట్టారు. దీంతో మరింత ఉద్రిక్తతలు తలెత్తకుండా ఆ ప్రాంతంలో బలగాల సంఖ్యను పెంచారు. అక్కడ నిరంతరం గస్తీని కొనసాగిస్తున్నారు.

చిత్రం..బోసిపోయనట్టు కనిపిస్తున్న డేరా బాబా ఆశ్రమం